Friday 23 January 2015

ఇక్కడ ఎంత కుళ్ళు ఉందో అంత ఆకర్షణ ఉంది

ప్రతిఒక్కడూ ఇస్టపడుతూ ..కస్టపడే రంగం ఒక్క సినిమా రంగమేనేమో...ప్రతిఒక్కర్నీ చూడండి.వాళ్ళుచెసే వ్రుత్తిని అవసరం కొసం 
చేస్తారు.బ్రతకటం కొసం చెస్తారు.చెస్తున్న పనిని ఇస్టపడకపొఇనా చెస్తారు.
కానీ సినిమారంగం అలాకాదు.
ప్రతిఒక్కడూ అదేదో దెవ లొకంలో ఉన్నాట్టు...వ్రుత్తిని తాదాత్మ్యంతొ ..ఎకాగ్రతతో. పని చేస్తారు .ప్రేమతో పని చేస్తారు.
సినిమా..అదో రంగులవల 
పంచ వన్నెల కల .
ఇక్కడ ఎంత ఎంతా కుళ్ళు ఉందో అంత ఆకర్షణ ఉంది
అందుకే ఈ రంగానికింత ఆదరణ ...

22 NOVEMBER 2012
**************************
నన్ను కొయండి...ప్లీజ్..నన్ను కొసుకొండి..కూర వండుకోని తినండి అని కోడే వచ్చి కటికోడి కాళ్ళదగ్గిర తిరుగుతుంటే ఎవరైనా ఎంచెస్తారు? సినిమా వాళ్ళ దెగ్గిరకు ..ఇలాంటి కోళ్ళు చాలా వస్తుంటాయి....సినిమా వాళ్ళతో ..విందారగించటం గొప్ప అనుకుంటూ కొన్నాళ్ళతర్వాత ...అవే ..విందు భొజనమైపొతాయి ..అసలు సంగతేంటంటే ఇక్కడ ఎవరి లెక్కలు వారికుంటాయి. ఆ లెక్కలు బయటివాళ్ళకి అర్ఢం కావు
22 NOVEMBER 2012
**********************************
వాణ్ణంటే ..ఉరి తీసాము.కానీ మనచుట్టూ ఉన్న కసబ్ ల సంగతేంటి.మన చుట్టూ ఉన్న వాళ్ళు తుపాకీ పట్టరు .కాల్పులు జరపరు .కానీ వాళ్ళు మన జీవితాలని ఒక్క ఆలోచనతో నరకం చెయగలరు.వాళ్ళే చట్టాలను తయారుచేసెది..వాళ్ళే చట్టాలను అమలుపరిచేది.ఎందుకూ పనికి రాని వెధవని ఎన్నుకోని వాణ్ణి చట్ట సభలకు పంపితే వాడు అక్కడ రాజ్యాంగం సాక్షిగా సామాజిక ఉగ్రవాదిగా కొట్లు కోట్లు కొల్లగొడతాడు . నిజానికి అయొగ్యుడికి ఓటెసిన ప్రతివాడూ కసబ్ తోసమానమే. అయొగ్యుడికి ఓటెసిన ప్రతివాడూ విధ్వంసకారకుడే
21 NOVEMBER 2012
*******************************
వ్యవస్థే..విషపూరితమైనప్పుడు ...వ్యవస్థలొని అన్ని అంగాలూ విషపూరితమైనప్పుడు వ్యక్తులు స్వచంగావుండటం కష్టం . స్వచంగవుండాలని ప్రయత్నించినవాళ్ళు ప్రతి చోటా వెర్రివాళ్ళవుతారు.ఇలాంటివాళ్ళు బ్రతికినంతా కాలం పిచివాళ్ళుగా గుర్తింపు. పొందుతారు .బతికినంతకాలం పిచివాళ్ళుగా గుర్తింపు పొంది ....చచ్చాక నిజమైన గుర్తింపు పొందుతారు  
20 NOVEMBER2012
************************************
ఆంధ్రప్రదెష్ ప్రజలంతా ప్రస్తుతం డబుల్ మీనింగ్ పత్రికలు ...డబుల్ మీనింగ్...రాజకీయాలు ...డబుల్ మీనింగ్ సినిమాలు .....చూస్తున్నారు .ఎటొచ్చీ ఎం నమ్మాలొ...ఎవర్ని నమ్మాలొ తెలీని స్థితి
19 NOVEMBER2012
*********************

మనుషులు మర మనుషులు అయినప్పుడు మాటలు ఖాళీ అవుతాయి .మనసులు దగ్గిర అయినప్పుడు కూడా మాటలు ఖాళీఅవుతాయి మాటలు ఖళీ అవటమంటే నిన్ను నువ్వు శూన్యం లొకి ఒంపేసుకొవటం. .మాటలు ఖళీ అవటమంటే నిన్ను నువ్వు హెచ్చవెసినా.. భాగించినా.. తీసివెసినా ...మళ్ళీ.. నువ్వు నువ్వుగా మిగిలి పొవటం. మాటలు ఖాళీ అవటమంటే చెలి అంటించిన చితిలో బతికుండగానే పిడికెడు బుగ్గిగా మారటం
18 NOVEMBER 2012

No comments:

Post a Comment