Monday 19 January 2015

నాకు వాడెలా స్నేహితుడవుతాడు.....చచ్చిపొయిన ..నా.. తెలుగు సినిమా దర్శకమ్మిత్రుడి ..స్నేహానికి ..తిలాంజలి గా..


@@
ఇరవయ్యేళ్ళప్పుడు..ఆత్మ వంచన ..ఓ కే.
నలభయ్యేళ్ళపుడు కూడా ఆత్మవంచన.. ఓ కే...
అరవయ్యేళ్ళదెగ్గిర కూడా ..ఆత్మవంచన ఏంటిరా..రాక్షసుడా.. 
ఆత్మ వంచన తో నేను..ఏ ఎడారి వనసీమల్లో జల పాతాలు పుట్టించాలి?
నేను ఏ నిశ్శబ్ద సమాధుల ..స్మశాన వాటికల్లో ..దివ్య రాగాన్నై ..విని పించాలి?
నాకు ..వాడెలా స్నేహితుడవుతాడు ?
..నేను ఆకలి తొ ఉన్నఫ్ఫుడు..వాడు పంచ భక్ష్య ..పరమాణ్ణాలతో,, భోజనిస్తూ కూడా..పిడికెడు..ఎంగిలి మెతుకులు విదిల్చనటు వంటివాడు ..నేను ఏడుస్తూ ఉంటే ..నా జేబులో ఉన్న ..కర్చిఫ్ ని కూడా లాగేసుకోని....నాదుఖాన్ని..నవ్వుతూ చూస్తూ వినోదించిన వాడు ..నాకు ..స్నేహితుడెలా అవుతాడు ? వాడి ..ఇంట్లో ..పండగ రోజుల్లో ..నేను లేను.వాడి ఇంట్లో వేడుకల్లో నేను లేను.వాడి విలాసాల్లో నేను లేను
కానీ వాడి గొప్ప పుట్టుకలో నేనున్నాను.నెలభాలుడిలా వాణ్ణి ..వెలిగించి....ఎదిగించి.. స్నేహానికి గుర్తుగా ..కానుకగా ..వాడిచ్చిన ..వాడు.. మిగిల్చిన ..వాడి అమావాస్యలో నిలబడ్డ మేము....వాణ్ణి మిత్రుడని ఎలా అంటామురా?
వాడు విషంలోవిషంలా కలిసిపోయినవాడు ..కాటు వేయబడ్డవాడికే ..ఆ విషం ఎలాంటిదో తెలుస్తుంది..
మనిషిని..మనిషిగా చూడలేనివాడు.. తనలోని ..విక్రుతత్వాన్ని..ప్రపంచం మీద ..కుమ్మరించేవాడు...నవ్వుతూనే ..చుట్టూ ఉన్నవాళ్ళ నాశనాన్ని కొరే వాడు .. మిత్రులందరికీ శాపంగా మిగిలినవాడు..విలువలులేక పోవటమే విలువలు గా మారిన వాడు..మిత్రుడెలా అవుతాడు ..
అవమానాలకు అర్ధంగా ..మిగిలిన ..నాకు మాత్రమే తెలుసు అవమానమంటే ఏంటో......
అందుకే ..నువ్వంటే నాకు ..అసహ్యం ...అందుకే ...నువ్వు నడుస్తున్న చొట్ల .రోడ్ల మీద కూడా నీ స్పర్శ కూడా తగల కుండా..
నాముందు నేనే ..కళ్ళాపి చల్లుకుంటూ ..తిరుగుతున్నాను
శత్రువు చావుకంటే కూడా అసహ్యమైన ..నీ తో ..నేను చెసిన స్నేహానికి గుర్తుగా ..నా మీద నాకే అసహ్యంతో.... నేను ఓ పాముగా మారాను..నన్ను నేనే ..తినేసుకుంటున్నాను ?
నాకు వాడెలా స్నేహితుడవుతాడు
చిర పరిచిత అపరిచితుడైన .. నిన్ను గుర్తు పట్టటం..ఎవరికీ ఏమంత కష్టంకాదు ..పెట్టిల్లున పగిలిన ..నీ మాయా ..మహల్ ..ధ్వానం ..ఈ ప్రపంచ మంతా విని పించే రోజు చాలా దెగ్గిర లోనే ఉన్నది..
నువ్వెవరో ..నేను చెప్పటమెందుకు?
త్వరలో నువ్వు నువ్వే ..నిన్ను నువ్వు ..నిర్వచించుకుంటూ బయటికొస్తావు

No comments:

Post a Comment