Friday 23 January 2015

అ ..అంటే ..అతను.. చెరబండరాజు ...........ఆ..అంటే ఆతడు ..నగ్నముని

అదెంటో. .అవేంటో....
అక్షరం పూలతీగాయిపొఇ ..
సుతారంగా నన్ను అల్లుకునేది

అక్షరం  పున్నాగపూలగుత్తులుగా మారి
పక్కనిండా పరవాశింపజెసేది.

హాస్చర్యంగా..చూస్తుండగానే అక్షరం.
కత్తులగుట్టగా మారేది..

చూస్తుండగానే .. అక్షరం .
తేనే తీగల తుట్టెగామారేది
      
ఏమీ తెలీని బాల్యావస్థలో ..
నాకు తెలిసిన భాషలో  ..నాకు దొరికిన అతను  ..
ఎడారిలో సముద్రం

భూమిమీది  మీది నక్షత్రం

తల్చుకోగానే ఇప్పటికీ .నా భుజాలమీద వాలే
రెక్కలున్న ఎగిరే నెలవంక

నెను ..నా..మనుమళ్ళకి నేర్పుతున్న ..
..నేను నేర్చుకున్న.. అక్షరాలు

..అంటే ..అతను.. చెరబండరాజు      
..అంటే    ఆతడు ..నగ్నముని 
..అంటే  ఇతడు ...జ్వాలాముఖి
అంటే   ఈతడు ..శ్రీ శ్రీ


No comments:

Post a Comment