Monday 12 January 2015

హిందూ మతాన్ని విమర్శించడమే గొప్ప ఫ్యాషన్

Srini Lakka ..
pk సినిమా చూసాక కలిగిన కొన్ని భావాలను మీతో పంచుకోవాలనుంది.దేవుడి కి మనిషి కి మధ్య ఈ బాబాలెందుకు అనే మంచి ప్రశ్న.(కానీ అసలు దేవుడి ఉనికే నమ్మకపోతే?)అవునూ ఈ బాబాల అవసరముందా?ఇంతమంది చదువుకున్నోల్లున్నారు అన్ని మతగ్రంధాల గురించి ఎందరో పెద్దలు రాసినా మళ్లీ వెళ్లి ఈ బాబాలతో (అన్ని మతాల వారు) చెప్పించుకోవాలా?చదివితే జనాలకు అర్ధం కాదా?సరే గీత,బైబిల్,ఖురాన్ లు వేరే(వాడుక/ప్రజల భాష కాని వాటినుంచి ) నుంచి వచ్చాయి కాబట్టి ఓకే అనుకున్నా మనలాంటి సామాన్యులు కొందరు రాసిన షిర్డీ సాయి సచ్చరిత్ర గురించి చెప్పడానికీ బోధకులు అవసరమా?
నావరకు నేనైతే గత కొన్నేళ్లుగా ఏ మతాన్నీ అనుసరించడం లేదు.అయినా నా అనుకున్న నా వాళ్లంతా ఒక మతాన్ని ఫాలో అవుతున్నారు.ఎంత కాదనుకున్నా నా వాళ్ల,నేను పుట్టిన మతాన్నే ఎందుకు పదేపదే కించపరుస్తున్నారు?అనే ప్రశ్నలు కలగడం సహజం.
ఈ సినిమాలో భయపడేవాళ్లు ఆలయాలకు వెళ్తారంటారు.నాకు తెలిసి హిందూ మతం లో ఎవరూ తప్పనిసరిగా ఆలయాలకు పొమ్మని చెప్పరు(తల్లిదండ్రులతో సహా).మరి భయపడే వారు ఆలయాలకు పోతే రోజుకు ఆ మతస్థులు 5 సార్లు ఎందుకు వెళుతున్నారు?ఉదయాన్నే నిద్రాభంగమయ్యేట్లు ఎందుకు మైక్ సెట్లలో అరచి రమ్మని పిలుస్తున్నారు?మరో మతమోల్లు ఇంటింటికీ కరపత్రాలతో,ఆదివారం రోజు మెగాఫోన్ తో ఎందుకు ప్రచారాలు చేస్తున్నారు?
ఈ సినిమాలో పాలను ఎందుకు అభిషేకాలపేరుతో వృధా చేస్తున్నారన్నారు అవును ఆకలి ఉన్నవారికి ఇవ్వొచ్చు.మరి ఇదే ప్రశ్న సమాధుల మీద చద్దర్లు కప్పే బదులు దానం ఇవ్వొచ్చని ఎందుకు అడగలేదు?
దేవుడు కనిపించడం లేదని హీరో కరపత్రాలు పంచుతాడు,మరి ఆ దేవుడు ఒక్క హిందూ దేవుడేనా?
ఒక గుడిలో పూజారి బలవంతంగా దక్షిణ తీసుకోవడం నేనైతే ఇంతవరకూ చూళ్ళేదు.మరి ఆలయాల్లో దక్షిణ తీసుకుని పూజారులో మరొకరో సంపాదిస్తుంటే ఇతరమతాల్లో సువార్త కూటములు,ఇజ్తెమాలకు లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో?
ఒక్క హిందూ బాబాతోనే హీరో తలపడతాడు,మరి మిగిలిన మతాల బాబాలో?వారు కూటములు,దయ్యాలు పారదోలుతామంటూ,క్యాన్సర్ బాగు చేస్తామంటూ కొబ్బరి నూనె లు ఇచ్చి పంపడం లేదా?తాయెత్తులు ఇవ్వడం లేదా?
అసలు ఈ సినిమానే కాదు హిందూ మతాన్ని విమర్శించడమే గొప్ప ఫ్యాషన్,సెచులరిజం గా చలామనీ అవుతోంది.ఇతర మతాల్లో,గ్రంధాల్లో లోటు పాట్లు లేవా,లోపాలు లేవా?
మేము ఏ మతాన్నీ నమ్మము అన్నప్పుడు మూసుకుని కూర్చోవాలి లేదంటే అన్నింటినీ విమర్శించాలి.పనిగట్టుకుని ఒక్క మతం పైనే పడి ఏడవడం ఎందుకో?
ఆ మార్క్సిస్ట్ మేధావి రంగనాయకమ్మనే చూడండి ఒకప్పుడు రామాయణ విషవృక్షం ఇప్పుడు మహాభారతం గురించి రాసింది.అంతా రంకుపురాణం అంటూ భారతం పుస్తకానికి పబ్లిసిటీ.అవునండీ పాతనిబంధన లో లాట్ అనే ఆయనకు సారాయి తాగించి ఆయన కూతుర్లు ఆయనతో ఆ మత్తులో సంగమిచి పిల్లలను కన్న కథ గురించీ రాయొచ్చుగా?వావి వరుసలు లేకుండా రమించినోల్ల కథలు బోలెడు దొరుకుతాయి.అసలు జ్ఞానాన్ని ఇచ్చే పండు తినొద్దన్న దేవుడి గురించి రాయొచ్చుగా....అప్పుడు ఇతరులు ఇళ్లమీద పడి తంతారని భయమేమో!
మరో మేధావి ఓల్గా...ఈవిడ కథల్లో పురాణ స్త్రీలు ఇలా అనుకుని ఉండొచ్చని కథలు.అవునండీ మీరూ మతాన్ని నమ్మరుగా...మరో ప్రవక్త 52 ఏళ్ల వయసులో 6 ఏళ్ల చిన్నారిని పెళ్లి చేసుకుందీ,ఆ తర్వాత 3 ఏళ్లకు ఆ అమ్మాయితో కాపురం చేసినప్పుడు ఆ అమ్మాయి గురైన లైంగిక హింస గురించీ కథ రాయరెందుకో???
ఇంకో ఆయన కంచ ఐలయ్య నేను హిందువునెట్లైతా అన్నప్పుడు ఆ మతం గురించి వదిలెయ్యాలి కానీ పడి ఏడవడం ఎందుకో?ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ పట్టి సెక్యులరిస్ట్లను బీఫ్ తినమంటాడు...చాలా బాగుంది...మరి ఇదే సెక్యులరిస్ట్లను పోర్క్(పంది మాంసం)తినమనగలడా?మరి అప్పుడు ముందుకొచ్చే ఆ సెక్యులర మతస్తులు ఉన్నారా?
ఏ పండుగ వచ్చినా ఈయన్ను tv show లో కూర్చోబెట్టడం,అవాకులుచవాకులు వాగించడం.
మరో ఉదాహరణ చూద్దాం..........బలి-వామన అంటూ ఒక నాటకం.బలి ద్రవిడుడొ,మూల జాతీయుడో కాబట్టి బ్రాహ్మణుడు తొక్కేసాడంట.మరి పురాణకథల్లో బలి తండ్రి విరోచనుడు,ఆయన తండ్ర ప్రహ్లాదుడు,ఆయన తండ్రి హిరణ్య కశ్యపుడు.ఆయన కశ్యప ప్రజాపతి కొడుకు.ఈ కశ్యపుడి కి పుట్టిన వాడే వామనుడు.అధితి కి పుట్టినవాడు,ఇంద్రుని తరవాత పుట్టినోడు కాబట్టి ఉపేంద్రుడు.మరి అందరి మూలాలు,తండ్రి ఒకడే అయితే ఏ జాతి వారు ఎవరిని తొక్కారో ఈ మేధావులకే ఎరుక.
అలాగే రామ కథనూ వక్రీకరిస్తారు.రావణుడు వీళ్ల లెక్క ప్రకారం ద్రావిడుడు అనుకున్నా మరి ఆయనేం బహుజనుడు కాదే?బ్రహమ వంశానికి చెందిన బ్రాహ్మణుడు కాదా?
దసరా,దీపావళి వచ్చినా ఇదే గోల...మూల పురుషులను చంపారని.వాళ్ల(రాక్షసుల కులాలు)మూలాల గురించి పురాణాల్లో రాసారా?
ఒక స్త్రీ కి అత్యంత గౌరవమిచ్చి జరుపుకునే పూజలు ఇతర మతాల్లో ఉన్నాయా?ప్రార్ధన స్థలాలకూ స్త్రీలను అనుమతించని మతాల సంగతేంటి?
ఒకనాటి బాల్య వివాహాలు,సతీ లాంటి దురాచారాలు పోయాయి,ఎవరూ నేడు మనుస్మృతిని అనుసరిచడంలేదు.వితంతు వివాహాలు,స్త్రీ విద్యల్లో ఎంతో పురోగమిస్తున్నాము.ఇంకా సంస్కరణల అవసరం ఎంటొ ఉంది అని భావించే వాళ్లు ఎందరో ఉన్నా ఎందుకు ఒక్క హిందూ మతం పైనే దాడి.మతం పుట్టినప్పటి నుంచీ అదే మూసలో ఉండి అజ్ఞానం లో కొట్టుకుపోతూ సంస్కరణలే తెలియని మతాల గురించి ఎవరూ మాట్లాడరెందుకు?
హిందూ మతంలోని ఎందరో బుద్ధి జీవులు అస్పృశ్యత అనే దురాచారానికి సిగ్గుపడి క్షమాపణలు అడిగేవాళ్లున్నారు.ఎన్ని అవమానాలెదురైనా ఇంకా ఆ మతాన్నే నమ్మిన వారున్నారు,వారూ త్వరలో సమాన హక్కులు పొందగలరు....కానీ కొందరు మతం మార్చుకున్న పెద్దలు మళ్లీ హిందూ మతాన్నే టార్గెట్ చేసుకుని విమర్శించడం లో ఔచిత్యం ఉందా?మతాలు మారినా ఈ మేధావులు తిరిగి హిందూ సర్టిఫికెట్లనే చూపించి రిజర్వేషన్ ఫలాలు పొందుతూ,ఉనత ఉద్యోగాలు చేస్తూ తిరిగి వారి పిల్లలకు రిజర్వేషన్ల కోసం వెంపర్లాడటం లేదా?మీరు కాదనుకుంటే మీ అణగారిన కులాల్లో మరొకరు లబ్ది పొందరా?
అంతే కాదు సాటిమనుషులతో మల మూత్రాలు ఎత్తించుకుని వారిని ఆ వృత్తిలో ఉంచినందుకు నేను క్షమాపణ అడుగుతాను.మరి అదే సమయంలో వారితో ఆ పని ఒక్క హిందువులే చేయించుకున్నారా అని అడుగుతున్నాను.
మతం నచ్చకపోతే వదిలెయ్యండి కానీ ఎందుకు అనవసరంగా ఒకే మతం మీద పడి ఏడుస్తారు?
నా ఎంపికతో నేనీ మతం లో పుట్టలేదు,,కానీ పదేపదే నేను పుట్టిన,నా వాళ్లున్న మతాన్ని కించపరుస్తుంటే ఇది రాసాను.
ఆలోచించండి.
with Gopireddy Srinivas Reddy

No comments:

Post a Comment