Saturday, 11 April 2015

ప్రజా హితమే మా జెండా.. అజెండా

చెప్పులు మోయటానికే పుట్టిన వాళ్ళు ..చెప్పులు మోయటమే..తమ జీవితం అనుకునే వాళ్ళు ..చెప్పులు మోయటమే తమ ఆనందం అనుకునేవాళ్ళు ..తమ వారసులక్కూడా ..చెప్పులు మోయటాన్నే నేర్పే వాళ్ళు ..తాము చనిపోతే ..చెప్పులతొనే ..తగులబెట్టమనే వాళ్ళు
వాళ్ళుంటారు....
బ్రాండ్ అబాసిడర్స్ ..
బానిసత్వానికి..భజన గీతాలకి .. 
ఇలాంటి వాళ్ళు గత తరాల్లోనూ ఉన్నారు .ఈ తరం లోనూ. ఉన్నారు రేపతి తరాల్లోనూ ఉంటారు..
అలా బానిసలకు పుట్టిన పుట్టు వారస బానిసలు..ఎవరైనా ఉంటే ..దయ చేసి....నా ప్రొఫైల్ లోంచి ..వెళ్ళిపోండి. బయటకు వెళ్ళి.మీ చావు చచ్చిపోండి ..
మేము మీ నీడను కూదా భరించలేము ..
మాకు వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం .మాకు నాయకులు కాదు..వాళ్ళు చేసే పనులు ముఖ్యం..
ప్రజా హితమే మా జెండా.. అజెండా
మేము ఈ దేశపు జెండాకి తప్ప ఎవ్వరికీ నమస్కరించము ..
అందుకే ..కులపిచ్చి ఉన్నవాళ్ళు ..మత పిచ్చి ఉన్నవాళ్ళు ..పక్క మనిషిని ప్రేమించలేనివాళ్ళు..నిజాన్ని ప్రేమించలేనివాళ్ళు ..ఈదేశాన్ని..ప్రేమించ లేనివాళ్ళు..దయచేసి..నా ప్రొఫైల్ వదిలి పెట్టి వెళ్ళి పోండి ..
మా అక్షరాల మిలిటెన్సీకి..మీ స్టాంపింగ్ అవసరంలేదు ..
మేము..మీ నీడను..బానిస భావజాలాన్ని ఒక్క సెకను కూడా భరించలేము .
మీకు తెలుసా..మేము మరణించిన చోట ..జాలిపడి మీరు ..కొవ్వొత్తి వెలిగిస్తే .. రెండోసారి మేము
మరణిస్తాము ..

మా ఆక్షరాల వ్యక్తిత్వం అది...మా అక్షరాల పవిత్రత అది.
త్వరలో ..మీ ముందుకొస్తున్నాము

Friday, 6 February 2015

సినిమాను తీయటానికి..మొట్టమొదట కావలసినది..తార్కిక జ్ఞానం

సినిమాను కాచి వడపొసినట్లు మాట్లాడే మేధావులెప్పుడూ ..సినిమాలు తీయలేరు.సినిమాను తీయటానికి కావలసింది ..మేధావితనం కాదు .తెలివి తేటలుకాదు .అతి తెలివి తేటలు అస్సలు కాదు.
సినిమాను తీయటానికి కావలసింది ..ఇంగితజ్ఞానం.
తనకు ఏం కావాలో ముందు దర్శకుడికి తెలియాలి .తనకు కావలసింది...ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో ..అనచనావేయగల ..సెల్ఫ్ రియలేజేషన్..వుండాలి .
సినిమా అంటే చచ్చిపొయేంత్ పాషన్ ..సినిమా కోసమే పుట్టాము .సినిమా కోసమే చస్తాము ..అనేవాళ్లను చూస్తే...నాకు జాలేస్తుంది..
ఒక మగ యెలుక.. ఏనుగును ..ప్రేమిస్తూన్నా ..అని ..ఆ ఆడ ఏనుగుకు. .మగ ఎలుక ప్రేమలేఖ రాయటం లాంటిది..సామాన్యులకు ..చూసే వాళ్లకు ..ఎంత నవ్వు పుట్టిస్తుందో ..కొంతమందిని చూస్తే అంతే నవ్వు పుడుతుంది ..
సినిమాను తీయటానికి..మొట్టమొదట కావలసిని..తార్కిక జ్ఞానం ..రెండోసారికావలసింది కూడా ..మూడోసారి కూడా కావల్సింది కూడా తార్కిక జ్ఞానమే.
ఈ తార్కిక జ్ఞానం ..విచక్ష్ణా జ్ఞానం కోల్పయిన మూర్ఖులు కొంతమంది ఉంటారు .వాళ్ళకి తమ కేం కావాలో తెలీదు.ఎదుటివాళ్ళకేం కావాలొ తెలీదు.చూడతానికి..వాళ్ళదెగ్గిర చాలా మేధస్సు ఉన్నట్టు..వాళ్ళని పరిశ్రమ ఉపయోగించుకోలేనట్లు ..కనిపిస్తారు.
ఇలాంటివాళ్ళు చాలామంది...సినిమా పరిశ్రమ లో తగులు తుంటారు .ఇలాంటివాళ్ల వయస్స్సు..ఒక్క సినిమా..లేదా రెండు సినిమాలు..మరీ తప్పితే..మూడు సినిమాలు ..అంతే..
ఆ తరువాత వీళ్ళు..సినిమా విమర్శ కులుగా మారిపోతారు .ఏదో తమ మానాన్ తాము హిట్ సినిమాలు తీసుకుంటూ పోతున్న ..దర్శకులని ..అన్ని ప్రచార..ప్రసార మాధ్యమాల్లో విమర్శించుకుంటూ..తమ ఈగోని...సంత్రుపిపరచుకుంటూ ఉంటారు .
వీళ్ళు జీవితాంతం కస్టపడ్డా కూడా ఒక్కటంటే ఒక్క ..వందరోజుల బొమ్మ .
తీయలేరు ..
మళ్ళీ చెబుతున్నాను ..తెలుగు సినిమాను తీయటానికి కావలసింది..తెలివి తేటలు కాదు ..ఇంగిత జ్ఞానం..విచక్షణా జ్ఞానం ..
ఇక్కడ మేధావులు..అన్నీ తమకు తెలుసుననే మేధావులు అక్ఖరలేదు ..

Vicci Martinez - Come Along ft. Cee-Lo Green

Thursday, 5 February 2015

క్రూరత్వం కూడా మనుషులకు కావాల్సిందే ..ఉండాల్సిందే...

దేవుడుకూడా..తను దేవుణ్ణని ..దేవుడు దేవుడులాగే ఉండాలని..దేవుడెప్పుడూ కరుణ..జాలి ..దయ..గురించి మాత్రమే మాట్లాడాలని..ఎదుటివాళ్ళు..ఎంతటి నీచులైనా వరాలు మాత్రమే ఇవ్వాలని..ఎప్పుడూ చెప్పలేదు .ఎక్కడా అనలేదు
.దేవుడు..తనను ప్రేమించేవాళ్ళదెగ్గిర మాత్రమే దేవుడు లాగా ఉన్నాడు .
దేవుడిలాగా ఉంటాడు. ఉండాలి కూడా
కానీ ..అందరూ గ్రహించాల్సిందేంటంటే..
దేవుడుకూడా ..రాక్షసుల్ని చంపాల్సి వచ్చినప్పుడు..తను రాక్షసులని మించిన రాక్షసుడిగామారాడు..మారాలని చెఫ్ఫాడు .
అలా రాక్షసుణ్ణి చంపాల్సి వచ్చినఫ్ఫుడు తను కూదా అతి క్రూరుడిగా మారకపోతే ..రాక్షసత్వాన్ని ..తనకు తాను ..ఆపాదించుకోకపొతే..దేవుడు కూడా రాక్ల్షసుణ్ణి చంపలేకపొయేవాడు
క్రూరత్వం కూడా..నీతే..
క్రూరత్వం కూడా..మనుషులకు అవసరమే ..
క్రూరత్వం కూడా మనుషులకు కావాల్సిందే ..ఉండాల్సిందే...అవసరాన్ని బట్టి మనుషులు కూడా ..రాక్షసంగా ప్రవర్తించటం తెలియాలి .లేకపొతే .
రాక్షసులు..క్రూరులు ఎదురైనప్పుడు..ఎలా ప్రతిస్పందించాలో తెలియక ....రాక్షసుల ..రాక్షసత్వానికి బలైపోతారు..
రాకషసత్వానికి ..రాక్షసత్వమే సమాధానం ..
రాక్షసులు కూడా ..తనను మించిన రాక్షసులెదురైనప్పుదు.. బ్రతకటం కోసం ..చూసేవాళ్ళకు ..నవ్వువచ్చే లా పరుగెడతారు ..
ఎటొచ్చీ క్రూరత్వాన్ని..ఎప్పుడు ..తమకు తాము ఆపాదించుకోవాలో..ఎవరిమీద క్రూరత్వాన్ని ప్రదర్శించాలో ..మనుషులు అర్ధం చేసుకోవాలి.
అది అర్ధ..అయ్యేలా చెప్పాల్సిన ..బాధ్యత...పెద్ద తరాల మీద ..పెద్ద మనినుషుల మీద ఉన్నది ..
నరమాంస భక్షకులకు ..నరమంస భక్షకుల భాష లో నే చెప్పాలి..
అదే..ధర్మం ..అదే ..అదే..నీతి ..దాన్నే ..ఎవ్వరైన్నా అనుసరించాలి...
అదిలేని...మతాలు చరిత్రలో ..బానిస దేశాలయ్యాయి..మట్టికొట్టుకు పొయాయి ..
అందుకే ..మానవత్వానికి దానవత్వానికి మధ్య ఉన్న తేడా..దాని అవసరాన్ని ..తల్లి దండ్రులు చిన్నప్పటించే..పిల్లలకు తెలియజెప్పాల్.
తర్ఫీదు ఇవ్వాలి

Tuesday, 3 February 2015

ఇక్కడ నా..జాగాని ఎవ్వరూ తీసుకోరు.


నేను బ్రతికినంతకాలం..నాకు ఏ..భూమి ..లేదు .
ప్రతి ఒక్కడూ..నా భూమిమీద పోటే నే .
అందరూ నా భూమిని కబ్జా చెయ్యాలని చూశే వాడే .
కానీ నేను చని పోయాక ....6 అడుగుల నేల మాత్రం ..అచ్చంగా నాదే..
నాదంటే నాదే..
ఇక్కడ నా..జాగాని ఎవ్వరూ తీసుకోరు.
ఇక్కడ ఎలాంటి పోటీ లేదు .
నాకు నా భూమి మీద హక్కు నేను చని పోయాకే వచ్చింది

బ్రతికున్నన్నాళ్ళు నాకు ..కానిది..ఇక్కడే ..ఈ స్మశానం లో నాదయ్యింది