Friday 6 February 2015

సినిమాను తీయటానికి..మొట్టమొదట కావలసినది..తార్కిక జ్ఞానం

సినిమాను కాచి వడపొసినట్లు మాట్లాడే మేధావులెప్పుడూ ..సినిమాలు తీయలేరు.సినిమాను తీయటానికి కావలసింది ..మేధావితనం కాదు .తెలివి తేటలుకాదు .అతి తెలివి తేటలు అస్సలు కాదు.
సినిమాను తీయటానికి కావలసింది ..ఇంగితజ్ఞానం.
తనకు ఏం కావాలో ముందు దర్శకుడికి తెలియాలి .తనకు కావలసింది...ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో ..అనచనావేయగల ..సెల్ఫ్ రియలేజేషన్..వుండాలి .
సినిమా అంటే చచ్చిపొయేంత్ పాషన్ ..సినిమా కోసమే పుట్టాము .సినిమా కోసమే చస్తాము ..అనేవాళ్లను చూస్తే...నాకు జాలేస్తుంది..
ఒక మగ యెలుక.. ఏనుగును ..ప్రేమిస్తూన్నా ..అని ..ఆ ఆడ ఏనుగుకు. .మగ ఎలుక ప్రేమలేఖ రాయటం లాంటిది..సామాన్యులకు ..చూసే వాళ్లకు ..ఎంత నవ్వు పుట్టిస్తుందో ..కొంతమందిని చూస్తే అంతే నవ్వు పుడుతుంది ..
సినిమాను తీయటానికి..మొట్టమొదట కావలసిని..తార్కిక జ్ఞానం ..రెండోసారికావలసింది కూడా ..మూడోసారి కూడా కావల్సింది కూడా తార్కిక జ్ఞానమే.
ఈ తార్కిక జ్ఞానం ..విచక్ష్ణా జ్ఞానం కోల్పయిన మూర్ఖులు కొంతమంది ఉంటారు .వాళ్ళకి తమ కేం కావాలో తెలీదు.ఎదుటివాళ్ళకేం కావాలొ తెలీదు.చూడతానికి..వాళ్ళదెగ్గిర చాలా మేధస్సు ఉన్నట్టు..వాళ్ళని పరిశ్రమ ఉపయోగించుకోలేనట్లు ..కనిపిస్తారు.
ఇలాంటివాళ్ళు చాలామంది...సినిమా పరిశ్రమ లో తగులు తుంటారు .ఇలాంటివాళ్ల వయస్స్సు..ఒక్క సినిమా..లేదా రెండు సినిమాలు..మరీ తప్పితే..మూడు సినిమాలు ..అంతే..
ఆ తరువాత వీళ్ళు..సినిమా విమర్శ కులుగా మారిపోతారు .ఏదో తమ మానాన్ తాము హిట్ సినిమాలు తీసుకుంటూ పోతున్న ..దర్శకులని ..అన్ని ప్రచార..ప్రసార మాధ్యమాల్లో విమర్శించుకుంటూ..తమ ఈగోని...సంత్రుపిపరచుకుంటూ ఉంటారు .
వీళ్ళు జీవితాంతం కస్టపడ్డా కూడా ఒక్కటంటే ఒక్క ..వందరోజుల బొమ్మ .
తీయలేరు ..
మళ్ళీ చెబుతున్నాను ..తెలుగు సినిమాను తీయటానికి కావలసింది..తెలివి తేటలు కాదు ..ఇంగిత జ్ఞానం..విచక్షణా జ్ఞానం ..
ఇక్కడ మేధావులు..అన్నీ తమకు తెలుసుననే మేధావులు అక్ఖరలేదు ..

No comments:

Post a Comment