Monday, 19 January 2015

అందుకే ..ఈ దేశం..బాగుపడదు. మీరు బాగుపడరు

అయ్యా..
ఓటరు మహాశయులారా
మీరంతా మమ్ములని అపార్ధం చేసుకుంటున్నారు.
తప్పు మీది.మేము ఊసినా దుమ్మెత్తి పొసినా ..పట్టించుకోకుండా గాలి గాళ్ళలా మమ్మల్నే ..మావారసుల్నే..మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటూ మా ఇళ్ళముందు ..తెరిగే గజ్జికుక్కల్లాంటి మీ కు మమ్మల్ని విమర్సించే హక్కెక్కడిది?
అసలు దొంగలు మీరు.పేడనీళ్ళు ముఖాన కొట్టి పంపాల్సిన నాయకుల వెనుక పెంపుడు జంతువులలా తిరుక్కుంటూ..మేము ఎదో మిమ్మల్ని పాడు చెసినట్టు చెప్పుకుంటారేంటి? అసలు పాడయి పొఇంది మీరు .నాశనమైపొఇంది మీరు.రేపు.మీరే కాదు..మీ పిల్లలు కూడా నాశనమైపొతారు నాశనమైపొవాల్సింది కూడా మీరే కేవలం..నాశనమవటానికే పుట్టిన జాతి మీది . చెప్పులతో కొట్టాలసిన వాళ్ళ చెప్పులు మొయటం కాకపొతే మేము పెట్టే ..పిచ్చి పాదయాత్రలకి మీరు వేడుకగా పనులన్నీ మానేసి రాటమేంటిర పిచ్చి పూవుల్లారా?
మేము ..ఇక్కడ ..డబ్బుకోసం..అధికారం కోసం..లాభాల కోసం..దేశాన్ని కుమ్మేసి ..మాఇనప పెట్టెల్లో దాచుకోవటం కోసం రాజకీయాలలోకి అడుగు పెట్టాము.. మీకిచ్చే ..కుంఖం భరిణలు ..క్రికెట్ కిట్లు .. మందు బాటిళ్ళు ..మేము ..పనికి ఆహారపథకంలో ..కోట్లు మిగిలిస్తేనేరా వచ్చేది .కాంత్రాక్టొర్ల దెగ్గిర కోట్లు ..కక్కుర్తి పడితేనేరా మీకివ్వగలిగేది.
మమ్మల్ని అవినీతిపరుల్ని చెసింది..మీరు ...ఇస్టం లేకపొఇనా సంపాఇంచటం మొదలు పెట్టి..చివరికి సంపాదనే ఇస్టం గా మిగిలిపొఇంది కదరా మీ వల్ల.
అందుకే స్వాతంత్రయం వచ్చిన దెగ్గిరనించీ ..మీరు అమ్ముడు పోతూనే వున్నారు.. .మీ తరువాతి తరాలవాళ్ళకి ..ఎలా అమ్ముడు పొవాలో చూపిస్తున్నారు .అందుకే ..ఈ దేశం..బాగుపడదు. మీరు బాగుపడరు . ఓ పనికి రాని పిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలకి కోటి రూపాయల ఖర్చేంటి?
ప్రజాస్వామ్యాన్ని ..ఓటర్లే అమ్మేయటం కాకపోతే ?
తెలంగాణా ..కావఛ్ఛు రాయలసీమ కావచ్చు ..సీమాంధ్రా కావచ్చు ..మరోసారి..అమ్మకానికి అందరూ సిడ్ఢపడండి..







No comments:

Post a Comment