Monday 19 January 2015

ప్రజలు వస్తువులవుతారు .ప్రతి ఇల్లూ ఓ బానిసల ఉత్పత్తి కెంద్ర మవుతుంది

నాకు భయం లేదు.పాకిస్తాన్..అన్నా..చైనా అన్నా..నాకు భయం..లేదు .చివరికి అమెరికా అన్నా నాకు భయం లేదు. నువ్వు అమెరికా అవుతే నేను వీర వియత్నాం అవుతా అనగలను.నన్ను ఎదుర్కున్న వాడు జార్జ్ బుష్ అవుతే ..నేను అల్జైదీ బూటునన్నా కాగలను. కానీ.. కా..నీ.. ఎన్నుకున్న మన నాయకులు ..నల్ల జాతీయులతో బానిస వ్యాపారం చెసే నల్ల జాతీయులలాగ..ఎదొ ఒకరొజు అందరినీ సామూహికంగా అమ్మెస్తారు. ....
ఇక యుద్ధ్హాలు ఉండవు . 
రక్తపాతం ఉండదు.
దెశం ఓ వ్యాపారకెంద్రమవుతుంది .ప్రజలు వస్తువులవుతారు .ప్రతి ఇల్లూ ఓ బానిసల ఉత్పత్తి కెంద్ర మవుతుంది..దేశమంతా ఓ విదేశ్ ఈ కర్మాగారమైపొతుంది .సామూహిక జనహననం ..అంతా .సామూహిక జనమరణం బిచ్చమెత్తుకోవటానికి కూడా జాగాకొనుక్కో వాల్సిందే. 
బ్రతికున్న ప్రజలని శవాలుగా మార్చటానికి ప్రభుత్వం.చిత్త శుద్దితో ..మూడు షిఫ్ట్ లూ పనిచెస్తుంది .
శవాలతో వ్యాపరంచెయటనికి ..స్మసానాలన్నీ ..బినామీపేర్లతో ..పార్లమెంట్ మెంబర్లు ..ఎం ఎల్ ఏ లు..లీజ్ కి తీసుకుంటారు. మనిషి బ్రతికుండటానికి ఒక కిడ్నీ ..చాలంటూ రెండో కిడ్నీ ని ..ప్రభుత్వమే కొట్టెస్తుంది.మనిషి చూడటానికి ఒక కన్ను చాలంటూ ..ప్రభుత్వమే ..ఒక కన్ను కొట్టేస్తుంది. 
మనుషులందరూ అమ్ముడవటానికి ఇలా స్పెర్ పార్ట్స్ దుకానాలవుతారు . 
మాల్స్ నిండా స్వదెసీయుల రక్తం..విదేసీ బ్రాండ్ ల పెర్లతో అమ్ముడవుతుంది. కాటికొచ్చిన శవాన్ని కూడా ఓటు పొతుందేమొ అని ..దొర్లించి మరీ ..పరీక్ష్గా చూస్తారు..ప్రభుత్వాధికారులు. ఉచితంగా శవాల అంత్యక్రియలు చెసే ముందు ప్రభుత్వం ..శవాల చర్మాన్ని ఒలిచి దాచెస్తుంది .
మనుషుల చర్మాలతో తయారైన సూట్కెసుల్లొ డబ్బుని తీసుకెళ్ళి మన నాయకులు విదెశాల్లో దాచుకుంటారు దేశంలో దేశం ..మనుషుల్లో మనుషులు ..అంతా అమ్మకమే, 
మనమంత అమ్మకమే ..
మనమెన్నుకున్న నాయకులే ..మన ఓనర్లై..మననమ్మేస్తుంటే ..చివరికి చావటానికి కూడ మనం ..ఉరితాడుని బిచ్చ మెత్తుకో వాలి చావటానికి చిటికెడు విషాన్ని కూడా..భిక్క్షాం దేహి అంటూ నాయకుల ఇళ్ళ ముందు క్యూ లో నిలబడాలి .

No comments:

Post a Comment