Monday 19 January 2015

జ్ఞానోదయం కావాలంటే....మనుషుల బ్రతుకులన్నీ...కాలిపోవాలి

డబ్బు కావచ్చు..అధికారం కావచ్చు..ప్రాణం కావచ్చు..చివరికి..స్వేచ్చ కావచ్చు..దేశం కావచ్చు .ఆఖరికి..అభిమానం కావచ్చు ఆత్మ గవురవం..కావచ్చు ..మనిషి కోరుకునేవి ఏవైనా..లక్జరీస్ కాకుండా ..అవసరాలై వుండాలి
ఆ అవసరాలు..అన్నీ తీరనివైనా అయి ఉండాలి ..అణచివేయబడి అయినా ఉండాలి .మనిషి కావలసిన..కోరుకున్న దానికోసం..అమానవీయంగా అవమానించబడుతూ ఉండాలి..ఉదయానికి అస్తమయానికి ..తేడా..తెలీని ..సుప్తలుడిగిన అచేతనావస్థలోకి మనిషి బ్రతుకు లాగివేయబడాలి ..కను చూపుమేర..ఎటుచూసినా..ఏ..అవసరం..తీరనటువంటి..వెర్రి ప్రపంచంలోకి..మనిషులు దిగ జారి పోవాలి ..ఏమనుషులకు అయిన్మా ..జ్ఞానోదయం కావాలంటే....మనుషుల బ్రతుకులన్నీ...కాలిపోవాలి. .కాలాగ్నిలో మాడిపోవాలి..
ఇప్పుడు..మనుగడ ప్రశ్నారధమైన చోటనుంచి ..అవసరం కోసం..మనిషిలోంచి..మరో మనిషి జన్మిస్తాడు .ఆ కొత్త మనిషి..కొత్త సూర్యోదయాన్ని చూస్తాడు .కొత్త సూర్యోదయాన్ని చూపిస్తాడు .కొత్త పరిమళాలని వెద జల్లుతాడు. .తనచుట్టూ ఉన్న వాళ్ళని వశపరచుకోని..కొత్త చరిత్రగా మిగులుతాడు
అందుకే మనిషికి..మనుషులకి..అవసరం మాత్రమే ..అమ్మ
అవసరం ..మాత్రమే ..గురువు..అవసరం ..మాత్రమే అవసరం
ప్రవక్తలు పుట్టుకొచ్చినా ..భగవద్గీతలు పుట్టుకొచ్చినా. .అన్నీ అవసరాల్లోంచిమాత్రమే పుట్టుకొచ్చాయి.

No comments:

Post a Comment