Thursday, 15 January 2015

ఇంటీంటికో కొత్త సమస్య..కొత్త చావు..కొత్త స్మశానం...

తెలంగాణా వాడు లేడు..
ఆంధ్రా వాడు లేదు ..
తన లాభకోసం..అందరూ పేదవాణ్ణి..సాటి మనిషిని అమ్మేసే వోళ్ళే ఉన్నారు ..ఈ దేశంలో..
అధికారం..లోకొస్తే చాలు ..అధికారానికి రావటానికి ముందు ...మనుషులు మనుషుల కొడుకుల్లా ఉన్నవాళ్ళు .. హటాత్తుగా కుక్కల కొడుకుల్లా మారిపోతారు .
ఆంటీ రాబీస్ ..వాక్సిన్ దొరక్కండా చేసి మరీ.. ప్రజలని పీక్కు తింటారు..
ప్రజలకు...కొత్త కొత్త రూపాల్లో ..కొత్త కొత్త నరకాల్ని చూపిస్తారు..
ప్రజలని నాశనం చేయటమే..అభివ్రుద్ధి.. ప్రజలని..బ్రతికుండగానే చంపేయటమే ..అభివ్రుద్ధి
అదికారం..అంటే పర్వర్షన్ ..అధికారం అంటే స్కిజొఫ్రీనియా................అబ్నొర్మల్ సయ్ కాలజీ తో బాధపడుతూ ..పిచ్చాసుపత్రుల్లో బ్రతికినంతకాలం..ఆల్ప్రజొలం ..టాబ్లేట్స్ వాడుతూ. నిద్ర పోవాళ్సినవాళ్ళు ..అధికారంలోకొచ్చినప్పుడు..ఉన్న స మస్యలు..ఏమాత్రం పోవు ..
లేని సమస్యలు పుట్టుకొస్తాయి
అమాయకులు.. తమ పని తాము చేసుకుంటూ ..పొట్ట పోసుకునే ..ప్రజలు.. కాలనీలు..బస్తీలు ..........అన్నీ ..నిర్వేదంతో స్మ శానాలవుతాయి .దేశం..రాష్ట్రం అయిదేళ్ళ పాటు నిర్వేద గీతాలు పాడుతుంటే ....ఇంటీంటికో కొత్త సమస్య..కొత్త చావు..కొత్త స్మశానం...
కొత్తగా వెలిసిన సూపర్ బజార్లల్లో ..ఉన్నవాళ్ళు ....వాళ్ళ ఇళ్ళల్లో ..కాళ్ళు తూడ్చుకునేండుకు ..గోచీగుడ్డలు కొంటున్నారని ..తెలిసి..పేదవాళ్ళు..తమ గోచీగుడ్డలు అమ్ముకోవటానికి..పరుగెత్తటమే...ప్రజాస్వామ్యంలో ..మారథాన్ .
అక్కడ..సూప బజార్ల ముందు పేదవాళ్ళ తొక్కిసలాటను అదుపుచెయ్యటానికి..జరిపిన కాల్పుల్లో పదిమంది..పేద వాళ్ళు చనిపోవటమే ..లా అండ్ ఆర్డర్.
అదే అభివ్రుద్ధి..అదే జన హితం..అదే ప్రజాస్వామ్యం.

నాకుతెలిసిన ..నేనుచూసిన..ఇకముందు చూడబోతున్న ..సత్యం..ఇదే

No comments:

Post a Comment