Thursday, 15 January 2015

మతం పేరుతో ఈ దేశం ముక్కలైపోవడం చరిత్ర..

నేడు పాకిస్తాన్‌గా ఏర్పడి ఉన్న ప్రాంతం లో క్రీస్తుశకం 712 నాటికి ఇస్లాం మతంవారు ఒక్కరుకూడ లేరు... అనాదిగా భారత ఉప ఖండంలో పుట్టి పెరిగిన వైదిక, వైదికేతర మతాల ప్రజలు మాత్రమే భారత ఉప ఖండంలో ఉన్నారు. లక్షలాది సంవత్సరాల పూర్వంనుండీ 712నాటికి భారత ఉప ఖండంలోని ప్రజలు తమను భారత జాతిగా, హిందూ జాతిగా, ఒకే జాతిగా భావించారు. భరతజాతి’, ‘హిందూజాతి’ అన్నవి పర్యాయ పదాలు. హిందువులంటే భారతీయులు... భారతీయులంటే హిందువులు. ఈ వాస్తవాన్ని దేశంలోని అన్ని వైదిక, వైదికేతర మతాలవారు అంగీకరించడం, విదేశాలవారు గుర్తించడం జరిగింది. క్రీస్తుశకం 712 తరువాత ఇస్లాం మతం మన దేశంలో ప్రవేశించింది. దాదాపు అదే సమయంలో పారశీక మతంవారు భారత ఉపఖండంలోకి వచ్చి పడ్డారు. ఇస్లాం ‘జిహాదీ’లు పారశీకుల నివాస భూమి అయిన పర్షియా నుండి పారశీకులను నిర్మూలించారు. పర్షియా ‘ఇరాన్’గా మారడానికి ఇస్లాం ‘జిహాదీల మతం మార్పిడి కారణం. ఇస్లాం జిహాదీ హత్యలకు, ఇస్లాంలోని మతం మార్పిడికి బలైపోయి పారశీకులు నశించారు. మిగిలినవారు పారిపోయి వచ్చి భారతదేశం/హిందూ దేశంలో ఆశ్రయం పొంది హాయిగా జీవిస్తున్నారు. వారు ఏనాడు భారతీయ ధర్మామాన్న, ప్రజల విశ్వాసాలను వ్యతిరేకించలేదు. తమకు ప్రత్యేక దేశం కావాలని కోరలేదు. ఇస్లాం మతం జిహాదీలు 712 లో భారత ఉపఖండంలో చొరబడి నేటి పాకిస్తాన్‌లో ఉండిన 100% హిందువులను స్వదేశీయ మతాలవారిని బలవంతంగా ఇస్లాంమతంలోకి మార్చారు. 712 నుండి ప్రారంభమైన మతం మార్పిడివల్ల 1947నాటికి పాకిస్తాన్‌ లో స్వదేశీయ మతాలవారి సంఖ్య 30%కి పడిపోయింది. 1947 తరువాత పాకిస్తాన్ ఏర్పడడానికి, భారత ఉపఖండం ముక్కలు కావడానికి ఇస్లాం మతం మార్పిడులు, జిహాదీల ఇస్లాం మతహింసే కారణమన్నది తిరుగులేని చారిత్రక నిజం. ఇందుకు కారణం ‘ఇస్లాం’ మత నాయకులు మిగిలిన మతాలవారి వలే తమ ‘మతాన్ని’ అనాది హైందవ జాతీయతలో భాగంగా అంగీకరించకపోవడం. అట్లాగే బ్రిటీషర్స్ తాము దిగుమతి చేసిన ‘క్రైస్తవంలోకి సామాజిక అంతరాలను సాకుగా చూపించి మత మార్పిడులకు పాలపడ్డారు. అంటే ఈ దేశంలోని స్వదేశీయ మతాలవారిని విదేశాలనుంచి వచ్చిన ‘క్రైస్తవం’లోకి ‘ఇస్లాం’లోకి మతంమార్పిడి చేయడానికే ఎక్కువగా పాలకులు, మతవాదులు పాల్పడారు తప్ప భారత లేదా హైందవ సామాజిక జీవన వ్యవస్థని పటిష్టం చేయడానికి ఇప్పటివరకు యే కొద్దిపాటి కృషి కుడా పాలకులు చేయలేదు. పైగా బయటినుండి వచ్చిన మతాలవారు సైతం తాము అనాది హిందూ జాతిలో భాగమన్న విజ్ఞతని, ఆలోచనల్ని భారత ప్రజల నుంచి దూరం చేసి మరీ ప్రజల్లో మతాల పేరుతో వైరుధ్యాలు పెంచారు. ఇప్పుడు ఈ దేశం అన్ని మతాలవారిది, అందువల్ల ఈ దేశం హితం దృష్ట్యా అన్ని మతాలవారు విఘాతకరమైన దురాచారాలను, వికృతులను వదలిపెట్టడం, దేశ హిత కారకమైన పద్ధతులను అవలంబించడం బాధ్యతగా భావించాలి..@ జనబందు.

No comments:

Post a Comment