Wednesday, 14 January 2015

నా గది

నా గుండెలో దాక్కున్న
ఫిడేలురాగం  ఎప్పుడన్నా
నీలి నిట్టూర్పు  విడిస్తే
పరుపు తన పొత్తిళ్లలో
దాచుకొని  ఊరడిస్తుంది ....
జలతారు ఆకాశాన్ని
చట్రంలో  బిగించి చూపే
కిటికీ కావ ల రెండు పక్షులు
నా చిన్నతనం నుంచి
ప్రెమగా పొట్లాడు   కుంటూనేవున్నయి... 
వాటికెంతకీ అలుపు రాదు ...... 
వాటికెంతకీ   ప్రేమ తీరదు........
ఆకాశంలోంచి  మొలిచిన
వీనస్ చెయ్యిలా సీలింగ్ కి
ఫాన్ గిర గిరా  తిరుగుతుంటుంది....
గదిలొ శబ్దం ఎప్పుడన్నా  ఘ నీభవిస్తే
స్టీరియో  మైఖేల్ జాక్సొన్ అవుతుంది..............
లతామంగెష్కర్  అవుతుంది ....
నా గదిలొ
కుప్పపొసిన పుస్తకాలమధ్య
నేను అచ్చం 
ప్రాణమున్న  పిచ్చి  మొక్కలా
ఊపిరి పీలుస్తుంటాను  .......
నెను ఇక్కడే
నీలి జలపాతాలు  తయారు చేస్తాను ....
నెను ఇక్కడే
నన్ను నెనె గాలిపటం     చేసుకొని
గాలిలొ కెగరెసుకుంటాను....... 

No comments:

Post a Comment