Sunday, 18 January 2015

చావు కూడా ప్రభుత్వాలకెప్పుడూ ఆహారమే ..

వ్యక్తులు మారొచ్చు.ప్రదేశాలు మారొచ్చు.వ్యవస్థలు మారొచ్చు.
కానీ.
మనుషులందరి విషాదం..మాత్రం..ఈ భూగోళం లో ఎక్కడైనా ఒక్కటే .ఏ జాతివాడివైనా..ఏ మతం వాడి వైనా ..ఏ కులం వాడివైనా ......కన్నీళ్ళు ఉప్పగానే ఉంటాయి. 
గాలానికి చిక్కుకున్న చేప కన్నీటి తడి...వేటగాళ్ళకు ఎలా తెలుస్తుంది ...... 
ఎదుటి మనుషుల చావు కూడా ప్రభుత్వాలకెప్పుడూ ఆహారమే .. 
అందుకే..
సంక్షేమం..పేరు కావచ్చు.. సబ్సిడీలు అనొచ్చు ..రుణాల రద్దు అనొచ్చు ..పేరేదైన..అంతిమంగా..ప్రభుత్వాలకు ..ప్రజలే ఆహారం .
ప్రభుత్వాల వల్లకాట్లో..సమాధులూ ప్రజలవే....చితి మీద కాలిపొయేవి ప్రజల శవాలే ...
పార్టీ ఏదైనా..పేరేదైనా ..ఏపార్టీ జెండాలు మోసినా ..ఎవ్వరైనా..ఇందులకు అతీతం కాదు
కాకపొతే...శవాల మీద కప్పే జెండా మాత్రమే మారుతుంది..

No comments:

Post a Comment