Wednesday, 21 January 2015

ఏళ్ళుగడిచాక నాకు అర్ధమైంది

ఎంతమంది మానవులను క్షొబ పెడితే అంత గొప్ప నాయకుడవుతాడు.ఎంత మంది మనుషులను దోచుకుంటే ..అంత గొప్ప ధనవంతుడవుతాడు.
28 Decembe 2012

నాకు ప్రతిరొజూ పత్రికలలో కనిపించేవి...దిక్కులేక ఆహుతి అవుతున్న ..ఒదార్చేవాడు లేక సహగమనం చేస్తున్న అక్షరాలు ..కాలిపోతున్న రేపటి యువతరం కలలు ...కాటికాపరులే ..పసువులకాపరులైతే ..ఎలావుంటుందో అలావుంది పరిస్థితి. బ్రతికున్నవాళ్ళంతా చచ్చిపొఇ కూడా కాటికాపర్లకు పొట్టకూటికొసం పనికొచ్చినట్టు రెపటితరం కలలన్నీ ..బుగ్గి అయి...బూడి దై ..

నన్ను నేను పారేసుకున్న ప్రతిసారీ ..నేను నీకు దొరుకుతాననుకున్నాను . ఏళ్ళుగడిచాక నాకు అర్ధమైంది ..నన్ను నేను పారెసుకొవటంకాదు ఆమే నన్ను పారేసిందని

కవిత్వం..ఓ ఫీలింగ్...కథ..ఓ ఇన్సిడెంట్....నవల ఓ జీవితం ....కవిత్వం..కథ నవల .ఈ మూడింటి తేడా ఇంతే

జర్నలిజం లో అక్షరాలు నమ్మకానికి ప్రతిరూపం.అమ్మకానికి కాదు

రాసే కవిత్వం లో కవిత్వం ఉంటే ..అది కాలానికి ఎదురొడ్డి నిలుస్తుంది.కాలం ఎన్ని పరీక్షలుపెట్టినా ఎదురొడ్డి ఏ యుద్ధంలో ఐనా గెలుస్తుంది

కొంతమంది అంతే.మనుషుల్ని..కుక్కల్లా చూస్తారు.కుక్కల్ని మనుషుల్లా చూస్తారు.జంతువులంటే అమితంగా ఉచ్చాహం ..అమితమైన ప్రెమ చూపే వాళ్ళు ఖచ్చితంగా సాడిస్టులై వుంటారు

No comments:

Post a Comment