Monday, 12 January 2015

రాజకీయనాయకులంతా సెక్రటేరియట్ లో చేసెది ..వ్యాపారం .



క్షమించండి...
మొన్న మీ ఫారం కివచ్చినప్పుదు..నేను ..మాకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూశాను.కొత్త అవిటిదైన భారతదేశాన్ని చూశాను.పనికి రాని ప్రభుత్వాన్ని చూశాను.
నాకు తెలిసి..ఈ భారత దెశంలో..ఏ ప్రభుత్వం వచ్చినా నేను ఇప్పటిదాకా చూసింది..ప్రజలంతా..ఎన్నికలైన మరు నిమిషమే ఫర్ సేల్ కోసం .స్పెసిమన్లు గా .ఆంగట్లో అమ్మకానికి ..అయిదేళ్ళు..నిలబడటం ..
ప్రభుత్వాలన్నీ ..ప్రజందరినీ క్లియరెన్సె సేల్ పెట్టి మరీ అమ్మేస్తుంది.
రాజకీయనాయకులంతా సెక్రటేరియట్ లో చేసెది ..వ్యాపారం ..
మీకు తెలుసా
నాద్రుష్టిలో సెక్రటేరియట్ అనేది ..షాపింగ్ మాల్..
ఇక్కడ అంతా అమ్మకమే..అంతా వ్యాపారమే..ప్రజలను ..వాళ్ళ భవిష్యతును ..అమ్మేస్తూ అధికార వ్యవస్థ..మాచ్ ఫిక్సింగ్ చేసుకోవటమే కద ఇక్కడి పాలనా వ్యవస్థ .
అందుకే మీ 125 ఎకరాల ఫార్మ్..చూసినప్పుడు..ప్రభుత్వ వ్యవస్థ..వైధవ్యం..వైఫల్యం స్పష్టంగా కనిపించింది
ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నది.
ఈ మట్టి మీద.. ఈ.. దేశం మీద.. మీకున్న ప్రేమ కని పించింది..ఏదో ఇతర దేశాల్లో ఉండి..కష్టపడి దాచిన ప్రతి పైసా తీసుకొచ్చి..ఇక్కడ పెట్టుబడి పెట్టి..ఏదో చెయ్యాలనే ..తాపత్రయం కని పించింది..
ఒక ఖమ్మం జిల్లావాడిగా.. ఈదెశం వాడిగా..మీ ఫారం..లో ..పసిపాపలా నిద్ర బొతున్న కొన్ని ఈ దేసపు కలలున్నాయి ..వాటిని నేను చూశాను..అందుకే స్వప్నించండి..
ఏమాత్రం..అధ ర్య పడకండి ............ఏరంగంలో అయినా ..మొదటి ప్రయాణీకుడు ..ఎప్పుడూ ఒంటరివాడే..విజేతలెప్పుదూ ఒంటరివాళ్ళే ..
ఆస్ట్రెలియా మిత్రులు శ్రీనివాస్ ఘాట్టి గారి..ట్రీ ఆయిల్స్ ఇండియా లిమిటెడ్..జహీరా బాద్ ..ఫార్మ్ హవుస్ ..చూసాక ..ఇది నా ప్రతిస్పంద న

No comments:

Post a Comment