తాంబూలాలు ఇచ్చేశారు..’!
____________________________
హడావుడిగా విభజన తంతు పూర్తిచేయడం వల్ల ఏపీకి మాత్రమే కాదు తెలంగాణకు కూడా నష్టం జరగబోతున్నదని నేను ఆనాడే చెప్పాను. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వారు సైతం చట్టానికి సవరణల అవసరాన్ని గుర్తిస్తున్నారు. తెలుగు ప్రజల మధ్య శాశ్వత శత్రుత్వానికి దారి తీసే పలు అంశాలకు పరిష్కారం చూపకుండా హడావుడిగా వ్యవహరించడం వల్లనే ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా భారీగానే మూల్యం చెల్లించుకుంది. అవిభక్త కవలలను విడదీయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అదేమీ జరగలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు రెండు ప్రాంతాల సరిహద్దుల్లో నిర్మించినందున రాష్ట్ర విభజన జరిగితే ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అప్పుడే చెప్పారు. ఇప్పుడు అదే సమస్య అనుభవంలోకి వస్తోంది.

‘అయినను పోయి రావలె హస్తినకు’ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు ఢిల్లీ వెళ్లి ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. అటు కేంద్రంలో, ఇటు తెలుగు రాష్ర్టాలలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరి ఎనిమిది నెలలు కావస్తోంది. అయినా విభజన చట్టంలో పొందుపరచిన అంశాలతో పాటు, బిల్లుపై చర్చ సందర్భంగా నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ అమలుకు నోచుకోలేదు. విశాఖపట్టణంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఐఐఎంకు మాత్రం శనివారంనాడు శంకుస్థాపన చేశారు. మిగతా కేంద్ర సంస్థల ఏర్పాటులో ఎటువంటి పురోగతీ లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడి వలె ఏపీ ప్రజలకు ముఖ్యమైన సంక్రాంతి పండుగ రోజు కూడా ఇంట్లో ఉండకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని అపాయింట్‌మెంట్ సంపాదించి తన కష్టాలను ఏకరువు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందనీ, అర్జెంట్‌గా ఆదుకోవాలని ప్రధానికి మొర పెట్టుకున్నారు. అటువైపు నుంచి ఏ హామీ లభించిందో తెలియదు గానీ, ముఖ్యమంత్రి చెప్పిందే నిజమైతే ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టే! ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రం అభివృద్ధికి ప్రణాళికలు వేయడంతో పాటు, నూతన రాజధాని నిర్మాణం కత్తి మీద సామే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఏ చీకూ చింతా లేదు. అందుకే ఆయన సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి తన ఫామ్‌హౌస్‌లో జరుపుకొన్నారు. 16 వేల కోట్ల లోటు ఉందని చెబుతున్న ఏపీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబుకు ఈ వెసులుబాటు లేదు. అందుకే ఆయన ఢిల్లీలో కనిపించిన మంత్రినల్లా కలిసి కోర్కెల చిట్టాను విప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల గురించి కాసేపు పక్కన పెట్టి చట్టంలోని పదవ షెడ్యూల్‌లో పొందుపరచిన సంస్థలను ఎలా పంచుకోవాలి? పరీక్షలను ఎలా నిర్వహించుకోవాలి? వంటి అంశాలపై ఎదురవుతున్న చిక్కుముళ్లను విప్పడానికి కూడా కేంద్రం చొరవ తీసుకోవడం లేదు. ‘తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్నట్టుగా వివాదాల పరిష్కార బాధ్యతను ఉభయ రాష్ర్టాలకే వదిలివేస్తున్నారు. ‘మా ఆయనే ఉంటే...’ అన్నట్టుగా రెండు తెలుగు రాష్ర్టాల మధ్య సఖ్యత ఉంటే వివాదాలు ఎందుకు ఏర్పడతాయి చెప్పండి! మన మధ్య సయోధ్య లేకపోవడమే కాకుండా అంతులేని అపోహలు ఉన్నందున పెద్ద మనిషి పాత్ర పోషించవలసిన కేంద్రం గానీ, ఉమ్మడి గవర్నర్ గానీ ‘మీ చావు మీరు చావండి’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎంసెట్ పరీక్షల విషయమే తీసుకోండి. చట్టాన్ని ఎవరికివారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. అవతలి పక్షమే చట్టం ఉల్లంఘిస్తున్నదని ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ అంశంపై ఉభయ రాష్ర్టాల విద్యా శాఖ మంత్రులతో రెండు మూడు దఫాలు సమావేశాలు నిర్వహించిన గవర్నర్ కూడా చిక్కు ముడిని విప్పలేక గుళ్లు గోపురాలు సందర్శిస్తున్నారు. ఎవరి వాద నలో వాస్తవం ఉందనేది అటు కేంద్రం గానీ, ఇటు గవర్నర్ గానీ తేల్చిచెప్పడం లేదు. దీంతో ప్రజలలో అయోమయం నెలకొం టుండగా, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మధ్య వర్తిత్వం వహించవలసినవారు తమకు ఎందుకులే అని చొరవ తీసుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి పలు అంశాలు వివాదాస్పదమై చివరకు న్యాయస్థానాలను ఆశ్రయిం చాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విభజన సమస్య కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. దీనికం తటికీ కారణం నాటి యూపీఏ ప్రభుత్వమే అని చెప్పక తప్పదు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల కోర్కెను తీర్చడం ఎంత ముఖ్యమో, విభజన తర్వాత ఉభయుల మధ్య వి వాదాలు, సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం! అయితే నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేం ద్ర ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి అలక్ష్యం ప్రదర్శించింది. ఏదో ఒక విధంగా అర్జెంటుగా తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారే గానీ ప్రజా ప్రయో జనాల గురించి ఆలోచించలేదు. ఉభయ రాష్ర్టాలకు నష్టం చేసే అంశాలు చట్టంలో ఎన్నో ఉన్నాయి. ఫలితమే రాష్ట్ర విభజన చట్టానికి సవరణలు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. హడావుడిగా విభజన తంతు పూర్తిచేయడం వల్ల ఏపీకి మా త్రమే కాదు తెలంగాణకు కూడా నష్టం జరగబోతున్నదని నేను ఆనాడే చెప్పాను. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వారు సైతం చట్టానికి సవరణల అవసరాన్ని గుర్తిస్తున్నారు. తెలుగు ప్రజల మధ్య శాశ్వత శత్రుత్వానికి దారి తీసే పలు అంశాలకు పరిష్కారం చూపకుండా హడావుడిగా వ్యవహరించడం వల్లనే ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా భారీగానే మూల్యం చెల్లించుకుంది. అవిభక్త కవలలను విడ దీయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అదేమీ జరగలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు రెండు ప్రాం తాల సరిహద్దుల్లో నిర్మించినందున రాష్ట్ర విభజన జరిగితే ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఉమ్మడి రాష్ట్ర చివరి ము ఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అప్పుడే చెప్పారు. ఇప్పుడు అదే స మస్య అను భవంలోకి వస్తోంది. ఉభయ పక్షాలూ మా మాట విననప్పుడు మేం మాత్రం ఏమి చేయగలం అంటూ కృష్ణా జలా ల యాజమాన్య బోర్డు కూడా చేతులెత్తేసింది. ఇలాంటివి ఎన్నో!
_
హామీలన్నీ హుళక్కి.. మిగిలింది బతిమిలాటే!
ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం ద్వారా తమకు న్యాయం చేయవలసిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే అర్థిస్తున్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవడానికి మిత్రపక్షమే అయినప్పటికీ చంద్రబాబుకు మాత్రం ఊరట లభించడం లేదు. అయినా కాలు దువ్వలేని పరిస్థితి ఆయనది. అప్పటికీ ఆయన కేంద్రం వద్ద ఒదిగి ఒదిగి ఉంటున్నారు. వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నారు. అయినా ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయమే తీసుకుందాం. విభజన చట్టంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వెంకయ్యనాయుడి కోరిక మేరకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిండు సభ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించారు. అమల్లో ఉన్న నిబంధనలు, విధివిధానాల ప్రకారం చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా పొందే అర్హత లేదనే చెప్పాలి. అయినా అధికార, ప్రతిపక్షాలు ఏకమై హామీ ఇచ్చాయి. ఇప్పుడు ఆ హామీని అమలు చేయమని కోరితే దేశంలోని మెజారిటీ రాష్ర్టాలు అంగీకరించిన పక్షంలోనే ప్రత్యేక హోదా ఇవ్వగలమని చెబుతున్నారు. ఈ విషయం అప్పుడు తెలియదా? ఆనాటి రాజ్యసభలో కూడా ఇప్పుడున్న రాజకీయ పక్షాలే ఉన్నా యి కదా? వారే కదా రాష్ర్టాలలో అధికారంలో ఉన్నది? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని ప్రకటించినప్పుడే అభ్యంత రాలు ఉన్నవారు ఆ విషయం చెప్పి ఉండవలసింది. అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు అభ్యంతరం చెప్పడం ఎంత వరకు సమంజసం? జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా లభించడం అసాధ్యమనే చెప్పాల్సి ఉంటుంది. అదే జరిగితే అందుకు అధికార పక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కూడా బలపడాలని భావిస్తున్న ఆ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను, పొందిన హామీలను నెరవేర్చని పక్షంలో సీమాంధ్ర ప్రజల అభిమానాన్ని ఎలా చూరగొనగలదు? విభజన వల్ల ఏపీలో 16 వేల కోట్ల రూపాయల లోటు ఉంటుందనీ, ఈ లోటు ను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆనాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఇందుకోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అదేమని ప్రశ్నిస్తే, ‘‘ఆందోళన చెందవద్దు. బడ్జెట్‌లో కేటాయించకపోయినా ఏదో ఒక రూపంలో లోటును భర్తీ చేస్తాం కదా’’ అని బదులిచ్చారు సదరు మంత్రివర్యులు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం పూర్తికావడానికి మరో రెండున్నర నెలలు మాత్రమే మిగిలి ఉంది. అయినా అతీగతీ లేదు. అంటే ప్రత్యేక హోదాతో పాటు ఈ విషయం కూడా హుళక్కి కాబోతున్నదన్న మాట! ఇక నూతన రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసే విషయానికి వద్దాం. ఈ అంశాన్ని బిల్లులోనే పొందుపరిచారు. అయినా ఇంత వరకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలే అమలుకు నోచుకోకపోతే ఏమి చేయాలన్నదే ప్రశ్న! పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను తూచ్ అంటే ఏమి చేయాలి? ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. కేంద్ర సహాయం లేకుండా ఏపీ నిలబడే పరిస్థితి లేనందున కొట్లాడే సాహసం చేయలేరు. నయానో భయానో పని కానిచ్చుకోవాలంటారు గానీ, చంద్రబాబుకు ఒకే ఆప్షన్ ఉంది. అది బ్రతిమిలాడుకోవడం!
_ ‘ఉచితా’నుచితాలు మరవొద్దు!
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీ అభివృద్ధికి భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని కలలు కంటున్నారు. రాజధాని నిర్మాణానికి అయిదు వేల కోట్ల రూపాయలను తొలి దశలో అందివ్వాల్సిందిగా ఆయన చేసిన విజ్ఞప్తికి ప్రధాని నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. ఈ నేపథ్యంలో ఏపీ భవిష్యత్తుపై ఆ రాష్ట్ర ప్రజలు సహజంగానే ఆందోళన చెందుతున్నారు. వారి లో నెలకొన్న ఆందోళనను తొలగించవలసిన బాధ్యత అటు కేం ద్ర ప్రభుత్వంపైనా, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఉంది. కేంద్రం ఆదుకోని పక్షంలో ఈ నెల జీతాలు కూడా ఇవ్వలేమని చంద్రబాబు నాయుడు తొలిసారిగా బయటపడ్డ్చారు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగానే అంత ఆందోళనకరంగా ఉందా? అన్న సందేహం కలుగుతుంది. అదే నిజమైతే చంద్రన్న సంక్రాంతి కా నుక కోసం 320 కోట్ల రూపాయలను వెచ్చించడంలోని ఔచిత్యం ఏమిటి? పేదలను ఆదుకోవడం అవసరమే గానీ, ఉచితాలకు అ లవాటు చేయడం మాత్రం సమర్థనీయం కాదు. గతంలో ఇటువ ంటి ధోరణిని అవలంబించడం వల్లనే అటు కేంద్రంలో, ఇటు రా ష్ట్రంలో నిధుల కొరత ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని వెచ్చించే విధానానికి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. కుల సంఘాల భవనాలు నిర్మించ డానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేతికి ఎముక లే దన్నట్టుగా నిధులు మంజూరు చేస్తున్నారు. కేసీఆర్‌ను స్వయం గా కలిస్తే భవనాలు ఏమి ఖర్మ ఏదైనా ఇస్తారు అని ఒక సంద ర్భంలో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యా నించారు. గతంలో కుల సంఘాలకు మహా అయితే స్థలాలు కేటాయించేవారు. ఇప్పుడు భవనాలు కట్టుకోవడానికి కూడా డబ్బు ఇస్తున్నారు. ఒక కులం వారితోనో, ఒక వర్గం వారితోనో మంచి అనిపించుకోవడానికి కానుకలు, విరాళాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థించగలం? 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాలలో కఠినంగా ఉండేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి ఉదారంగా వ్యవహరించారు. దీంతో ఆయనకు పేదల పక్షపాతి అన్న కీర్తి లభించింది. బహుశా ఈ అనుభవం వల్లనే కాబోలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పేదల పక్షపాతి అని తాను కూడా అనిపించుకోవడానికి కానుకల విధానానికి తెరతీసి ఉంటారు. అయితే అపాత్రదానం చేయకూడదని అంటారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే గుర్తుంచుకుంటాడు. కడుపు నిండిన వాడికి ఇంకా పెట్టాలని ప్రయత్నిస్తే ఏమి ప్రయోజనం ఆశించి చేస్తున్నాడో అని సందేహిస్తాడు. దీని అర్థం ఏపీలోని పేదలందరికీ కడుపు నిండుతోందని చెప్పడం కాదు. అభివృద్ధి- సంక్షేమం మధ్య సమతౌల్యం ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం. ఈ సమతౌల్యం దెబ్బతినడం వల్లనే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో పండుగ రోజు పిచ్చి కుక్కలు కరిచి 20 మంది వరకు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తీసుకువెళితే రేబిస్ వ్యాక్సిన్ లేదని వైద్యులు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయడం ఎంత వరకు సమంజసం అన్నదే ప్రశ్న. ఈ విషయం అలా ఉంచి రాష్ట్ర విభజనానంతరం ఉభయ రాష్ర్టాల మధ్య తలెత్తిన వివాదాలు, అటు తెలంగాణ- ఇటు ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల అమలు విషయానికి మరోసారి వద్దాం. ప్రతి విషయంలో తెలుగు ప్రజల మధ్య చిచ్చు రాజేయడానికి కారణమవుతున్న అంశాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవలసిందే! అవసరమైతే ఇందుకోసం చట్టాన్ని సవరించాలి. లేని పక్షంలో అధికారంలో ఉన్నవారు తమ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టించే ప్రమాదం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడటం, తాజాగా రెండు రాష్ర్టాలుగా విడిపోవడం అనేది వాస్తవం. అదే సమయంలో ఈ సంఘటనలు ఇక చరిత్రలో ఒక భాగం మాత్రమే! ఇప్పుడు మనం ఆలోచించవలసింది వర్తమానం, భవిష్యత్తు గురించి మాత్రమే! నిత్యం కలహించుకునే బదులు సామరస్యంగా జీవించడానికి, పరస్పర సహకారంతో అభివృద్ధి చెందడానికి కృషి జరగవలసిన తరుణం ఆసన్నమైంది. ఇందుకోసం ఉభయ రాష్ర్టాలకు చెందిన తటస్థులు ఒక గ్రూపుగా ఏర్పడి అటు కేంద్రంపైన, ఇటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావలసి ఉంది. పది కోట్ల వరకు ఉన్న తెలుగువారిలో పెద్దమనుషులే లేరా? ఉంటారు. అయితే పాలకులు ముందుగా భావోద్వేగాలు రెచ్చగొట్టే విధానానికి స్వస్తి చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలలో నిర్వహించే కోడి పందాలకు తెలంగాణ కోసం నినదించిన కవి, గాయకుడు గోరటి వెంకన్న వెళ్లారు. అక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం, ఆతిథ్యం లభించాయి. దీన్ని బట్టి అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రజలు జరిగిన దానిని మర్చిపోవడానికి సిద్ధపడుతున్నారని అర్థమవుతోంది. అయితే ‘మర్చిపోదామని మీరు అనుకున్నా మిమ్మల్ని మర్చిపోనివ్వం’ అంటూ మన నాయకులే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా గానీ, సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా గానీ ఎంతో మంది ఎన్నో విధాలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అటువంటి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకులు ఇప్పుడు మంత్రి పదవులలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మాత్రం మాజీలుగా మిగిలారు. అటు సీమాంధ్రలో సైతం భీకర ప్రకటనలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బడా బడా నాయకులు అడ్రస్ లేకుండా పోయారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వారిని అక్కడే కూర్చోబెట్టారు ప్రజలు. భావోద్వేగాలు కొంతకాలం పాటు రెచ్చగొట్టవచ్చు గానీ, ప్రజల జీవితాలతో మాత్రం ఆటలాడుకోవడానికి నాయకులు సాహసించకూడదన్న నీతి ఇందులో ఉంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర పాలకులు కూడా ఈ విషయం గుర్తుంచుకోవాలి. కొత్త సంవత్సరంలోనైనా తెలుగు ప్రజల మధ్య మైత్రి చిగురించాలని కోరుకుందాం. భౌతికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉందామని నాడు చేసిన బాసలను నాయకులు గుర్తుకుతెచ్చు కోవాలని కోరుకుందాం. ‘తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది’ అని పశ్చిమ గోదావరి జిల్లాలలోని వెంప గ్రామంలో నిర్వహించిన కోడి పందాలలో పాల్గొన్న తెలంగాణకు చెందిన ఒకరు నినదించారు. తెలుగు ప్రజలందరూ డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన ఈ పాటను పాడుకునే రోజు రావాలని ఆశిద్దాం!

_ చట్టం కాదు.. చైతన్యం ముఖ్యం!
రాజకీయాలను కాసేపు పక్కనపెట్టి ఏపీలో నిర్వహించిన కోడి పందాల విషయానికి వద్దాం. ఈ పందాల నిర్వహణ ఏటా వివాదాస్పదంగా మారి, పండుగ నాటికి ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ప్రజలు సంప్రదాయంగా జరుపుకొనే పండుగలు, ఆచారాల విషయంలో కోర్టులు, చట్టాలు జోక్యం చేసుకోవడం అవసరమా? అన్న ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతోంది. జంతు బలులను నిషేధించడంతో పాటు జీవ హింస అరికట్టడానికి చట్టాలు ఉన్న విషయం వాస్తవమే! ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న ఈ చట్టాలను అమలు చేయగలమా? లేదా? అన్నది పాలకులు ఆలోచించాలి. ఒకప్పుడు గ్రామాలలో జంతు బలులు అంటే మేకలు, కోళ్లను దేవతలు, దేవుళ్ల ముందు నరికి చంపేవారు. ఈ ఆచారం క్రమేపీ కనుమరుగవుతోంది.
ఎక్కడో మారుమూల ప్రాంతాలలోనే జంతు బలులు కొనసాగుతున్నాయి. కోళ్లు, మేక మాంసాన్ని విక్రయించడానికి వధ్యశాలల ఏర్పాటుకు ప్రభుత్వాలే అనుమతి ఇస్తున్నాయి. అక్కడ వాటిని చంపడం లేదా? బహిరంగ ప్రదేశాలలో ఆ ప్రాణులను చంపడం మంచిది కాదు. ఆరోగ్యానికి హానికరమని ప్రచారం చేయవచ్చు. ప్రజలే ఆ విషయం గ్రహించి జంతు బలులకు దూరంగా ఉంటున్నారు. అలాగే కోడిపందాల సంస్కృతి కూడా మున్ముందు మాయం కావచ్చు. అమలు చేయలేని అంశాలపై రాద్ధాంతం చేయడం ఎందుకన్నదే ప్రశ్న. కోడి పందాల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. దానిపై అప్పీలుకు వెళ్లగా ఏమి చెప్పారో తెలియని విధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని అర్థం చేసుకునేలోపే పండుగ ముగిసింది. కోడి పందాలు కూడా జరిగిపోయాయి. ఇటువంటి విషయాలలో అటు పాలకులు, ఇటు అధికారులతో పాటు న్యాయస్థానాలు కూడా కొంత సంయమనం పాటించడం అవసరం. ఆరునూరైనా కోడి పందాల నిర్వహణను అనుమతించేది లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కోడి పందాల నిర్వహణ కోసం అధికారులపై ఒత్తిడి తేవడం సహజం. ఒత్తిళ్ల వల్ల గానీ, మరో కారణం వల్ల గానీ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కూడా ఈ విషయంలో నిస్సహాయంగా ఉండిపోయారు. మిగతా జిల్లాలకు కూడా ఎస్పీలు ఉంటారు కదా! ఒక్కొక్క జిల్లాలో ఒక్కో విధానం ఎందుకు? పంతాలకు పోయి చట్టం తలవంచే పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? గతంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్పీలుగా పనిచేసిన వారు ముందుగా ఇలాంటి ప్రకటనలే ఇచ్చేవారు. ప్రకటనల దారి ప్రకటనలదే! పందాల దారి పందాలదే అన్నట్టుగా ఉండేది. కోడి పందాల వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. పందాలను అడ్డుకోవడానికి ప్రయత్నించే బదులు స్థోమతకు మించి పందాలు కాయడం ద్వారా నష్టపోవద్దని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. అంతేగానీ చట్టాలు, కోర్టుల ద్వారా ఆచార వ్యవహారాలను అడ్డుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఫలితం ఉండదు. చట్టాలను అమలు చేసే అధికారులు, కోర్టులు ఇలాంటి విషయాలలో తమ గౌరవాన్ని కాపాడుకోవడం మంచిది!
__________________________________
సౌజన్యం: ఆంధ్రజ్యోతి దినపత్రిక (18-01-15)

No comments:
Post a Comment