Saturday 31 January 2015

బ్రతుకే ఓ యుద్ధరంగమవు తుంది.

కొత్త ఆలోచనలెప్పుడూ అందంగా ఉంటాయి.కొత్త ఆలోచనలెప్పుడూ.ఉచ్చహాన్నిస్తాయి
.
కొత్తలోచనలెప్పుడూ విలువైనవి గానే కనపడతాయి.కొత్త న్న భావనే అంతులేని ఉచ్చాహాన్నిస్తుంది.
ఈ తియ్యదనమంతా ఆ కొత్త పనిని ప్రారంభించేంతవరకే….
పనిప్రారంభించటానికిముందు ..చుట్టూ ఉన్న వాళ్ళంతా ..నిన్ను ఆ ఆలోచన వచ్చినందుకు పొగుడుతారు..ఆ ఆలోచన ..నీకు రావటం ..నీ అద్రుష్టమంటారు .ఆ ఆలోచన ..మాకు రాకపోటం..మా దురద్రుష్టమంటారు
నీ ఆలోచనను రకరకాలుగా..విశ్లేషిస్తూ..సరికొత్త..అర్ధాలనిస్తూ …నిన్ను ..ముప్పిరిగొనేలా చెస్తారు.
కని..అసలు పని ప్రారంభించాక..అసలు యుద్ధం..నీకు తెలీయని విధంలో ఉంటుంది..నువ్వు నెర్చుకున్న ..యుద్ధం ఒకలా ఉంటే…నువ్వు చేయాల్సిన యుద్ధం..మరొకలా ఉంటుంది..
నువ్వు ..నీ చుట్టూ జరుగుతున్న ఏసంఘటననూ విశ్లేషించలేవు.ఎవరికీ వివరించనూ లేవు..ఏ పరిష్కారాన్నీ కనుక్కోను కూడా లేవు.
బ్రతుకే ఓ యుద్ధరంగమవు తుంది..
నువ్వు తల తిప్పి చూస్తే..నీ చుట్టూ ఎవరూ ఉండరు ..నిన్ను దిగు ..దిగు..అని ప్రోచ్చహించినవాళ్ళు..ఎప్పుడో నిన్ను వదిలేసిఉంటారు .
యుద్ధరంగంలో ఒంటరిగా నిలబడ్డ ..సైనికుడిలా అయిపోయి ఉంటుంది ..నీ పరిస్థితి.చేతిలో ఉన్న ఆయుధాలన్నీ అయిపొయాక ….నీ కు..నీ మరణం కూడా ..ఆ..బ్రతుకు ..పోరాటంలో కనిపిస్తూ ఉంటుంది .
దాన్నే ఫైయిల్యూర్ ..అంటారు ..
అలాంటి పరిస్థితిలో ..మన విజ్ఞానం కూడా ఓ అజ్ఞానం గా చూడబడుతుంది..
మన తెలివి తేటలు..అవతలివాళ్లకి చేతగాని కుప్పిగంతుల్లా కనిపిస్తాయి..
అందుకే కొత్త పనులు ప్రారంభించినవాళ్ళల్లో ..చాలామంది..ఫెయిలైపొతారు..
ఓడిపోతారు .ఒంటరివాళ్ళుగా మిగిలి పోతారు .
కొత్త పనుల్లొ ..వ్రుత్తుల్లో ..ఇక్కడ సక్సెస్ అనేది..కనిపించని శత్రువుతో కళ్ళకు కంతలు కట్టుకోని యుద్ధ చెయ్యటం లాంటిది..పట్టపగలు తమ నీదను తామే పట్టుకోని బంధించటం లాంటిది.
అందుకే విజేతలుగా కొంతమందే మిగులు తారు

No comments:

Post a Comment