Monday, 19 January 2015

దేవుడు ఎవరు...?

దేవుడు ఎవరు...?
.....
పరిణామ క్రమంలో మానవుడికి చిక్కు ప్రశ్నలుగా మారిన విషయాలు అనేకం ఉన్నాయి. కాలం క్రమంలో వాటిని పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఇంకా తెలియని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. వాటిలో మనకు అంతుచిక్కని శక్తుల విషయం కూడా ఒకటి. వీటికి ఎప్పుడో ఒకప్పుడు పరిష్కారం ఉంటుంది. దేవుడెవరు? అనే ప్రశ్నకు ఈ కోణం నుంచి సమాధానాలు వెతికితే తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. దేవుడు ఎలా పుట్టాడు..' అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఒకప్పుడు మనిషి ప్రకృతి శక్తులను అదుపుచేయలేకపోయేవాడు. వాటి నుంచి తనను తాను కాపాడుకోలేకపోయేవాడు. భయంకరమైన ప్రకృతిని ఎదుర్కోవటానికి అతనికి ఒక ఆలంబన కావాలి. ఆ ఆలంబనకు ఒక రూపం కావాలి. అలా ఏర్పాటు చేసుకున్న రూపాలే దేవుళ్లు. ఈ దేవుళ్లందరూ మానవుడి మెదడులో పుట్టిన వారే. మనకు హాని చేస్తారనుకొనేవారు రాక్షసులు. మేలు చేస్తారనుకున్నవారు దేవుళ్లు. వీరు ఎలా ఉంటారో ఎవరూ చూడలేదు. వారి శక్తిని ఎవరూ కొలవలేదు. మనిషి మెదడు ఎంత ఊహించుకుంటే అంత శక్తి.. ఊహించుకున్న వారికి ఊహించుకున్నంత. ఈ క్రమంలో సమాజంలో వేర్వేరు వర్గాల, తరగతుల ప్రభావం దేవుళ్లపై పడింది. కొన్ని తరగతుల వారు, కొన్ని వర్గాల వారు తమకు మేలు చేస్తారనుకున్న వారిని దేవుళ్లగా కొలవటం మొదలుపెట్టారు. మన దేశంలో ప్రతి రోజు కనిపించే లక్షల గ్రామ దేవతలు ఇలా పుట్టినవారే... @ జనబందు.

No comments:

Post a Comment