Sunday, 18 January 2015

.కొత్త ప్రభుత్వాలు చేసేదీ ..ప్రజల అమ్మకమే ..

ప్రజలు ఉన్నది..అమ్మకానికి.ప్రజలు పుట్టిందే అమ్మకమై పోవటానికి..అంగళ్ళ ల్లో దేశాల పేరు తో ..జాతుల పేరుతో ..మతాల పేరు తో అమ్మక మైపోతారు
భారత దేశంలో కొందరు కులం పేరుతో అమ్మకమై..పోతారు.మరికొందరు..మతం పేరుతో అమ్మకమై పొతారు. నా వాడంటూ కొందరు ... .నా కానివాడంటూ .మరికొందరు .అందరూ అమ్మకానికే .. అని తెలియకుండానే ..తెలుసుకోకుండానే...నశించి పొతారు .
నిన్ను అమ్మేవాడు..మరెవరో కాదు ..మరేదో దేశం వాడు కాదు .నీ వాడే ..నీ కులపోడే ..నీ మతపోడే ..నీ జాతీయుడే... నిన్ను పరాయి..మతస్థులకి..పరాయి జాతులకి..పరాయి దేశాలకు అమ్మేస్తాడు.
చరిత్రలో చాలా గెలుపులు ..వీరుల వీరత్వం వల్లనే కాదు...మనలోని వెన్నుపోటు దారులు అవతలి వాళ్ళకి అనుకూలంగా ..వ్యవహరించటం వళ్ళ గెలిచారు .
ఎందుకంటే ..ప్రభుత్వాలనేవి..ప్రజలను అమ్మే సూపర్ బజార్లు...షాపింగ్ మాల్ లు. కసాయి చేతిలో కత్తి ..అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు పుట్టింది..కోయ టానికె.......
అధికారంలో కి రాగానే ...కొత్త ప్ర భుత్వాలు కోస్తున్నా యని ..అరవటం..మొత్తుకోవటం అప్రజాస్వామికమైన చర్య..
ప్రజలెంత.. కసి గా కొత్త ప్రభుత్వాలని ఎన్నుకున్నా .
.కొత్త ప్రభుత్వాలు చేసేదీ ..ప్రజల అమ్మకమే ..
కోరుకున్న మొగుడు ..ఊసినా.. దుమ్మెత్తి పోసినా..ఉరి పెట్టి చంపినా ఎవరికీ చెప్పుకోలే నట్లు ...
..నవ్వుతూ చావటమే ..ప్రజలందరికీ శరణ్యం...
అందుకే ..మనమంతా ..మన ఓట్లతో అదికారాన్నిచ్చిన కొత్త ప్రభుత్వాల చేతుల్లో .. ఆనందంగా చచ్చి పోదాము ......అటు కేంద్రం లోనూ ..ఇటు రాష్ట్రంలోనూ

No comments:

Post a Comment