Wednesday, 21 January 2015

నేను ఎత్తి నిలబడ్డ జెండా మీద

ఏమీ తెలియని అజ్ఞానంలొ..
ఏమీ ..అర్ధంకాని ..గందరగోళంలో..
నేర్చుకుంటున్న అక్షరాలు ..బొసినవ్వులతో పసిపాపల్లా ..కాగితాలమీద ..అంబాడుతున్నప్పుడు..
మీ అక్షరల పాచజన్యంతో.. సమర నాదం పూరించినవాణ్ణి
మీరు ..నూరిన ..కత్తులతో ..యుద్ధ్హాన్ని ..నేర్చినవాణ్ణి
మీరు ..గీసిన..అగ్గిపుల్లలకు మంట అయ్యి ..వెలిగినవాణ్ణీ ..
మీరునాటిన ..జమ్మిచెట్టు మీద ..నా అక్షరాయుధాలని దాచినవాణ్ణి
అహరహం ...దిగంబర..కవులు..ఎక్కడ కనిపించినా..
నాకలానికెప్పుడూ .. పులకరింతే
యుద్ధరంగంలొ ఒంటరిగా ఉన్నప్పుడు
నేను ఎత్తి నిలబడ్డ జెండా మీద
దిగంబర కవులు..మీరంతా ..కనిపిస్తారు
{వచ్చే కవిసంగమం
..నిఖిలెశ్వర్..గారితో ..అని ఆయన ..బొమ్మ చూసి }

29 january..2013

No comments:

Post a Comment