Wednesday, 21 January 2015

నువ్వు నిజం .నువ్వు అబద్ధం

ఉన్నవాడికి ..తనను మరింత ఉన్నవాడిని చెయటానికి..దేవుడు కావాలి
లేనివాడికి ..తనను ఉన్నవాడిని చెయటానికి కావాలి.
ఆస్తికుడికి ..ఉన్నాడని రుజువు చెయటానికి దెవుడు కావాలి
నాస్తికుడికి లేడని రుజువు చెయటానికి డేవుడు కావాలి
ఎస్కెపిస్ట్ లకు...తాము అనుభవించేది ..పూర్వజన్మ సుక్రుతం అని చెప్పుకొవటానికి దెవుడు కావాలి 
అట్టడుగు వర్గాలకు ..తమకో ఆలంబనగా డెవుడు కావాలి

నువ్వు నిజం .నువ్వు అబద్ధం 
నువ్వు సత్యం ..నువ్వు అసత్యం
బుగ్గన దిస్టిచుక్క దెగ్గిరనించి....చావున పెద్ద బొట్టు వరకూ ...
కులం లేదు..మతం లేదు.. జాతిలేదు..భాషలేదు
ఏ తెడా లేకుండా మనిషన్న ప్రతివాడికీ నువ్వు కావాలి..నిన్ను నమ్మాలి
మనిషన్న ప్రతివాడు నిన్ను కొలవాలి
జాతి ..మత.. కుల.. వర్గ.. భెదాల ..తేడా లేకుండా, మనిషిని మనిషే నమ్మని ఈ రోజుల్లో ..మనుషులందరూ నిన్ను కొలుస్తున్నారంటే.. నువ్వు ఉండే ఉంటావు
నీ విషయం లో మనుషులంతా ఒక్కటె
ఆందుకే
దేవుడూ ..నీకు ..జిందాబాద్
28 November  2012  

No comments:

Post a Comment