Wednesday 28 January 2015

మార్కెట్లో ..సేలబిలిటీ కావటమే ..సేలబిలిటీ రావటమే ముఖ్యం …

ఆడియో ..ఫంక్షన్ కాగానే ..ట్రయిలర్ ..బయటకు రాగానే ..జనం ..ఇంత బెంబేలెత్తిపోతున్నారు?కంపు..కంపు అని మొత్తుకుంటున్నారు .అప్పుడే ఏమైంది..?.కంపు కొట్టేలా కావాలని రాయటం..కావాలని కంపుకొట్టేలా..చానళ్ళల్లో మాట్లాడటం..ఇవ్వాళ్ళ ..నాగరికత..ఫాషన్ .
రాముడు..మంచి బాలుడు అంటే ఎవరు చూస్తారు..
?ఏవరు పట్టించుకుంటారు ?
రాముడు ఓ సైకో అనండి ..అందరూ..ఆగిచూస్తారు ..
ఆ పక్కనే ..నర్గీస్ ఫక్రీ లాంటి అమ్మాయి..ఓ హండ్ కర్చిఫ్ ని మొల మీద వేసుకోని..సైకో తో ఓ రాత్రి..అంటే…జనం గుండెల్లో రాళ్ళు పడతాయి..
ఇక్కడ..మార్కెట్లో ..సేలబిలిటీ కావటమే ..సేలబిలిటీ రావటమే ముఖ్యం …
ఓ టెర్రరిస్ట్.. దేశాన్ని అమ్ముతాడు ..ఓ స్మగ్లర్..ప్రభుత్వాన్ని అమ్ముతాడు..ఓ ఎం ఎల్ ఏ ..నియొజకవర్గాన్ని అమ్ముతాడు.ఓరాష్ట్ర ముఖ్య మంత్రి రాష్ట్రాన్ని అమ్ముతాడు ..
ఇదే ఇప్పటి నాగరికత..నయా..సామాజిక నిర్వచనం
ఇప్పుడు..విలువలు లేవు.. విలువలు లేకపొవటమే విలువలు ఉన్నట్టు
ఎంత..అమ్మాము..ఎంత కొన్నాము ..ఇదే..మనుషుల్లో ఉన్నది ..
ఎప్పుడొచ్చామని కాదు అన్నయ్యా..ఎంత సంపాయించాము..ఎంతమందిని తొక్కాము..ఎంతమందిని..అవమానించాము. .ఎంతమంది అమ్మాయిల ని అనుభవించాము ..ఇదే సక్సెస్ కి మీటర్.
కొత్తదనం అంటే.. ఏమిటనుకుంటున్నారు.?.కుడిచేత్తో..వెనకాల కడుక్కోవటమే కొత్తదనం ..క్రియేటివిటీ అంటే ఏమిటనుకుంటున్నారు..కడుపులోంచి..విసర్జించాల్సినదాన్ని ..కర్చిఫ్ లో దాచుకోవటమే క్రియేటివిటీ..
మనుషులు జంతువులవటమే ..నాగరికత… ..
అందుకే ..క్రియేటివ్ మనుషుల్లో ..చాలామంది..జంతువులైపొయారు .కొత్తదనం..అంటే చెత్తదనమే..అన్న భావానికొచ్చేశారు. చెత్తదనానికి మాత్రమే సేలబిలిటీ ఉంటున్నదన్న నిజాన్ని గ్రహించి ..చెత్తోత్పత్తి కర్మాగారాలుగా రూపాంతరం చెందారు …
వీళ్ళద్రుష్టిలో ..మనుషులు..మనుషులు కాదు…మార్కెట్..
మనుషులు మార్కెట్ లో సరుకు. ఇక్కడ..అమ్మటాలు కొనటాలు మాత్రమే ఉంటాయి….
మార్కెట్లో.. అమ్మకాలు..కొనటాలు ..ఉన్నసరుకుని అమ్మటమేలా అన్నదే ఉంటుంది..ఉన్న..సరుకుకి..అమ్మకపు విలువను..పెంచటమెలా అన్నదే ఉంటుంది .
అజ్ఞానం ..జ్ఞానమైన చోట ..జ్ఞానం తనను తాను బ్రతికించుకోవటానికి అజ్ఞానం దెగ్గిర ఊడిగం చేస్తుంది .అజ్ఞానమే పల్లకీ ఎక్కి ఊరేగుతుంటే ..ఇష్టం లేకపొయినా ..బ్రతకటం కోసం జ్ఞానం..అజ్ఞానాన్ని ..బొయీలా మోస్తూ ఉంటుంది..చెప్పాను కదా..
మార్కెట్లో కి ఎప్పుడొచ్చామన్నది కాదు ముఖ్యం..ఎంతసంపాయించామన్నదే ముఖ్యం..
ఎలాగైనా సరే..ఏం చేసైనా సరే

No comments:

Post a Comment