Saturday, 24 January 2015

మా ...మానిఫెస్టో .........................

ఇవాళ్ళ మీరు చూస్తున్నది నన్ను కాదు .
మీ లోని నన్ను.మీరు మేరు కాదు .అది నాలొని మీరు .
దిగ్దిగంతాల మధ్య ,తూర్పార బట్టిన మానవ అస్తిత్వాల కళేబరాలు చెప్పే ..దవురభాగ్యపు చరిత్రలు మీకు గుర్తుకు తేవటానికి ….
నింగి నేలల సాక్షిగా ..మానవ అశ్రు గర్భాల్లోంచి ..పెల్లుబుకుతున్న ..దారుణ ..దావానలాల్లోంచి తన్నుకొస్తున్న సామాన్యుల అశక్తతని ..మీ మున్దుంచటానికి …ఇదిగో ..మేం ..మీ ముందు కొచ్చాము .
సమూహం లో ఉండి కూడా మనిషి ఒంటరి వాడైపోయాడు.నవ్వుతూ..స్వచ్చంగా ..బ్రతకాల్సిన మనిషిలో …వేలయాలిజం ప్రవేశించింది .
రోడ్డు ఎక్కితే చాలు అందరూ అందరూ తప్పిపోయిన మనుషుల్లా కనిపిస్తున్నారు .ఒక సంజె వెళ్ళ ఉదయించిన భయభ్రానతాల్లోంచి ఉద్భవించిన నరసింహ స్వామి సాక్ష్యంగా బీభచ్చ..భయానకాల తరువాత మిగిలిన నిశ్శబ్దాల మధ్య నిలబడ్డ ఒంటరి మనిషైపొయాడు ..నెఅటి..హయిబ్రీడ్ ….హయెటెక్ మానవుడు .
కూలిపోయిన సామ్రాజ్యాలనించి .కూలిపోయిన జమీందార్ల రాజ భావన పూనా దులనించి ..ఓ కొత్త తరం ..పుట్టుకొచ్చింది .ఈ రాజకీయ తరం మృగ భాష మాట్లాడుతుంది
ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ పాల రాతి భవనాలకు దిష్టి తగలకుండా ..కట్టిన పేద వాడి తల మాకు కనిపిస్తున్నది .
మానవ రక్తాభి షేకాలతోఈ రాజకీయ తరం ..మనిషి రూపం లో ఉన్న రాక్షస మర్రిచెట్టు అయిపోయింది .తానూ నరికెఅసిన సామాన్యుల..అమాయకుల..అభాగ్యుల ..పుర్రె పుర్రెకో ఊడని పెంచుకుంటూ..అది..ఊళ్ళను దాటింది .జిల్లాలను దాటింది. రాష్ట్రాలను దాటింది .ఖండాలను దాటింది .
శవాల మీద అది చేసే వికృత నాట్యం పేరు రాజకీయం ………..
ఆ శవాలలొ ..శవాలుగామారటానికి రేపటి తరం ..వర్తమానం అనే .. వధ్య శిల ముందున్నది .
నువ్వున్నావు..నేనున్నాను. తరాల మానవ జీవితం మొత్తం అధొఅగతి పాలై —రుజాగ్రస్తంగా…రోగ గ్రస్తంగా..మారిన జనం లో కొత్త సూర్యో దయానికి గుర్తుగా ఇదిగొఅ నేనొస్తున్నాను.
నా పేరు …………జయహో .కాం
చుట్టూ ఉన్న సంపదనంతా ఇంటిలొఅ దాచిపెట్టినా కోడా ఈ నర రాక్షసుడికి దాహం తీరటల్లెదు.ఒక్క ఇల్లు కాదు వంద ఇళ్ళు కావాలి .ఒక్క ఎకరం కాదు ..వందల ఎకరాలు కావాలి .
సిగ్గు లేదు ..ఎగ్గు లేదు …
న్యాయం లేదు ..అన్యాయం లేదు ..
అంతా అసహ్యం..అంతా అనాగరికం …
రేపటి తరాల భవిష్యత్తు …సంక్షోభం లో ఉన్నప్పుడు….గ్లొఅబలైజె షన్…లిబరలైజేషన్ ..పేరేదైనా ..అంతర్జాతీయ విపణి జ్వాలల మధ్య రేపటి తరం భవిష్యత్తును ..కాపాడుకోవటానికి .మేము ..నీళ్ళల్లో నిప్పు లా ..మంటల్లో మంచులా మీ ముందు కొస్తున్నాము.
మహాకవి ..శ్రీ శ్రీ ..తెలుగు ప్రజల చేతి కందించిన ఆధునిక భగవద్ గీత ‘మహాప్రస్థానం ‘ చేత బట్టుకొని ..మీకోసం .. ..రేపటి తరం కోసం .. ఇదిగో ..మా తలను..మేమే ..నరుక్కొఅవటానికి సిద్ధపడుతో ఇదిగొఅ ..మీ ..మున్దుకొస్తున్నాము.
మీ రేపటి తరం భవిష్యత్తు కోసం ..
జయహో. కాం

No comments:

Post a Comment