Sunday, 18 January 2015

ఇంత పెద్ద అబద్దపు చరిత్రను ప్రపంచంలో మరెవ్వరు చదివించలేదు..

ఆధునిక భారతదేశంలో స్వతంత్ర్యం కొరకు రెండు ఉద్యమాలు జరిగాయి..
1) యురేషియన్‌ బ్రాహ్మణుల స్వతంత్ర్య ఉద్యమం గోపాలక్రిష్ణ గోఖలే, బాలగంగాదర్‌ తిలక్‌, గాందీ, నెహ్రు నాయకత్వంలో ఆంగ్లేయుల బానిసత్వం నుండి విముక్తి కలగడానికి జరిగింది
2) మూలవాసి మహనీయుల స్వతంత్ర్య ఉద్యమం యురేషియన్‌ బ్రాహ్మణుల బానిసత్వం నుండి విముక్తి కావడానికి మహాత్మా జ్యోతిబా పూలే, సాహు మహారాజ్‌, బాబాసాహేబ్‌ అంబేద్కర్‌, పెరియార్‌ రామస్వామి నాయకత్వంలో జరిగింది..
ఇప్పుడు కేవలం యురేషియన్‌ బ్రాహ్మణుల ఉద్యమాన్ని మాత్రమే మనతో తప్పులతడకగా చదివిస్తున్నరు.. 63 సంవత్సరాలుగా మనం ఈ మాటలు వింటున్నం, వినడమే కాదు అదే నిజమని నమ్ముతం.. ఇంత పెద్ద అబద్దపు చరిత్రను ప్రపంచంలో మరెవ్వరు చదివించలేదు..
భారత్‌లో మొఘల్‌ చక్రవర్తుల 650 సంవత్సరాల పాలనలో యురేషియన్‌ బ్రాహ్మణులు స్వతంత్ర ఉద్యమం ఎందుకు మొదలు పెట్టలేదు. మరి ఆంగ్లేయుల 150సం॥ల పాలనలోనే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమం ఎందుకు మొదలు పెట్టారు?
దీనికి కారణం ఆంగ్లేయుల పాలనలో శూద్రులు, పంచములు, ఆదివాసీలు అతిశీగ్రముగా చదువుకుని చైతన్యులు కావడం బాస్కర్‌రావు జాదవ్‌ వంటి శూద్రులు 1895లోనే కలెక్టర్లుగా నియమించడం యురేషియన్‌ బ్రాహ్మణులు సహించలేక స్వతంత్రోద్యమ నాటకానికి పూనుకున్నరు.
భారత్‌లోని ప్రజలందరిని ఆంగ్లేయులు బానిసలను చేశారని యురేషియన్‌ బ్రాహ్మణులు అబద్దపు ప్రచారం చేశారు.. ఈ ప్రచారంలో భ్రాహ్మణ నీతి దాగి ఉన్నది. ఈ అబద్దపు ప్రచారంతో ములనివాసి బహుజనుల ఆలోచన నిజమైన శత్రువులు ఆంగ్లేయులని నమ్ముచున్నారు.. ఆంగ్లేయులు మనకు ఏవిధంగా శత్రువులు.?

No comments:

Post a Comment