Monday, 12 January 2015

ఎవరి తెలివి తేటలు..వారివే ..

స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత బ్రిటిష్ వాడొకడు తమ దేశానికి వెళ్ళే ముందు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక్కొక్కరికి ఒక్కో తుపాకీ ఇచ్చి వెళ్లాడు. తర్వాత కొంత కాలానికి ఆవ్యక్తి తిరిగి వచ్చి, తాను ఇచ్చిన తుపాకీతో ఆ ముగ్గురు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. తొలుత తెలంగాణ వ్యక్తిని కలిసి అడగ్గా, మీరిచ్చిన తుపాకీతో రోజూ పిట్టలు కొట్టి కాల్చుకు తింటూ ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పాడు. రాయలసీమకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ, తన ప్రత్యర్థులను చంపడానికి ఆ తుపాకీని ఉపయోగించాననీ, తనకిప్పుడు శత్రుశేషం లేదని చెప్పాడు.
ఆంధ్రకు చెందిన వ్యక్తిని ప్రశ్నించగా, మీరిచ్చిన తుపాకీని అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం చేసి సంపాదించాను అని చెప్పాడు.

No comments:

Post a Comment