Monday, 12 January 2015

మేము ఈ దేశపు జెండాకి తప్ప ఎవ్వరికీ నమస్కరించము .

చెప్పులు మోయటానికే పుట్టిన వాళ్ళు ..చెప్పులు మోయటమే..తమ జీవితం అనుకునే వాళ్ళు ..చెప్పులు మోయటమే తమ ఆనందం అనుకునేవాళ్ళు ..తమ వారసులక్కూడా ..చెప్పులు మోయటాన్నే నేర్పే వాళ్ళు ..తాము చనిపోతే ..చెప్పులతొనే ..తగులబెట్టమనే వాళ్ళు
వాళ్ళుంటారు....
బ్రాండ్ అబాసిడర్స్ ..
బానిసత్వానికి..భజన గీతాలకి ..
ఇలాంటి వాళ్ళు గత తరాల్లోనూ ఉన్నారు .ఈ తరం లోనూ. ఉన్నారు రేపతి తరాల్లోనూ ఉంటారు..
అలా బానిసలకు పుట్టిన పుట్టు వారస బానిసలు..ఎవరైనా ఉంటే ..దయ చేసి....నా ప్రొఫైల్ లోంచి ..వెళ్ళిపోండి. బయటకు వెళ్ళి.మీ చావు చచ్చిపోండి
..
మేము మీ నీడను కూదా భరించలేము
మాకు వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం .మాకు నాయకులు కాదు..వాళ్ళు చేసే పనులు ముఖ్యం..
ప్రజా హితమే మా జెండా.. అజెండా ..
మేము ఈ దేశపు జెండాకి తప్ప ఎవ్వరికీ నమస్కరించము ..
అందుకే ..కులపిచ్చి ఉన్నవాళ్ళు ..మత పిచ్చి ఉన్నవాళ్ళు ..పక్క మనిషిని ప్రేమించలేనివాళ్ళు..నిజాన్ని ప్రేమించలేనివాళ్ళు ..ఈదేశాన్ని..ప్రేమించ లేనివాళ్ళు..దయచేసి..నా ప్రొఫైల్ వదిలి పెట్టి వెళ్ళి పోండి ..
మా అక్షరాల మిలిటెన్సీకి..మీ స్టాంపింగ్ అవసరంలేదు ..
మేము..మీ నీడను..బానిస భావజాలాన్ని ఒక్క సెకను కూడా భరించలేము .
మీకు తెలుసా..మేము మరణించిన చోట ..జాలిపడి మీరు ..కొవ్వొత్తి వెలిగిస్తే .. రెండోసారి మేము
మరణిస్తాము ..
మా ఆక్షరాల వ్యక్తిత్వం అది...మా అక్షరాల పవిత్రత అది.
త్వరలో ..మీ ముందుకొస్తున్నాము
PL LIKE OUR PAGE



 

No comments:

Post a Comment