"మమ్మల్ని బద్నామ్ చేస్తున్నారు, మమ్మల్ని అణగదొక్కుతున్నారు" అని బ్రాహ్మణులు మొఱపెడతారు. ఈ మొఱలో నిజం ఉంది. కానీ "ఇక్కడ ఛప్పన్నకులాలతో మీరిలా ఎల్లకాలం మొఱపెట్టుకుంటూ, లేకపోతే పోట్లాడుతూ బ్రతగ్గలరా ?" అని బ్రాహ్మణుల్ని ప్రశ్నిస్తాను. Suppose, బ్రాహ్మణజాతికి ఒక కొత్త శుభోదయం కోసం ఇక్కడో, ఇంకో చోటనో బ్రాహ్మణులు మెజారిటీగా ఉండే ఒక ప్రాంతాన్ని - అది ఎంత చిన్నదైనా, బుజ్జిదైనా - శ్రమపడి ఏర్పాటు చేసుకుందామని ఒక బ్రాహ్మణుడు ప్రతిపాదిస్తే ఎంతమంది బ్రాహ్మణులు ఈ ఐడియాకి సరే అంటారు ? ఎంతమంది అలా ఏర్పఱచబడే ప్రాంతానికి పిల్లా, పాపలతో పెట్టే బేడాతో సహా సర్దుకుని రావడానికి సిద్ధంగా ఉంటారు ?
నేను చాలా అతిశయంగా మాట్లాడుతున్నానని, blunt గా అడుగుతున్నానని నాకు తెలుసు. కానీ అడుగుతున్నాను. పై ప్రశ్నకి సమాధానం నాకు తెలిసీ అడుగుతున్నాను. దానికి సమాధానమేంటంటే - "ఒక్క బ్రాహ్మణుడు కూడా రాడు" అనేది. ఎందుకో కూడా నాకు తెలుసు. వీళ్ళు తరతరాలుగా చాలా సుఖజీవులు. పరాన్నభుక్కులు. పుస్తకాలు ముందేసుకోవడం తప్ప నిజంగా శ్రమపడడం అంటే ఏంటో తెలీనివాళ్లు. Top and middle management పనులు తప్ప ఇంకేదీ చేయడం చేతకానివాళ్లు. చేయడం ఇష్టంలేనివాళ్లు. సొంతంగా ఏదైనా చేసే ధైర్యం లేనివాళ్ళు. వీళ్ళు పైకి ఇతరకులాల్ని ఎంత తిట్టుకున్నా, ఎంత మొఱపెట్టుకున్నా అంతిమంగా వాళ్ళ చంక నాకి బ్రతకాల్సినవాళ్లే. వాళ్ళే వీళ్ళ primary source. కనుక కేవలం 3 శాతం జనాభా గల ఈ వర్గాన్ని 97 శాతం మంది అసలు పట్టించుకోనే పట్టించుకోరు. అయినా సిగ్గులేకుండా వాళ్ళనే పట్టుకుని వేళ్ళాడతారు వీళ్ళూ, వీళ్ళ భావితరాలూ, తమ కులం యొక్క ఈ అంతర్గత బలహీనతల మూలాన ! పాపం, అంతకంటే ఏం చేస్తారు? Non-Brahmins తప్ప బ్రాహ్మణులకు వేఱే source లేదాయె బ్రతకడానికి !
నేను బ్రాహ్మణుల్ని నా మాటలతో బాధపెట్టి ఉంటే మీలో ఒకడిగా నన్ను దయచేసి మన్నించండి. మఱో చేదు కఠోర సత్యం చెప్పేసి విరమిస్తాను. అసలు సాక్షాత్తూ ఒక బ్రాహ్మణుడే ప్రభుత్వాధిపతి అయి, కాదు, కాదు, నిరంకుశ నియంత అయి, ఈ రాష్ట్రాన్ని పాతికేళ్ళపాటు నిరాఘాటంగా పరిపాలించినా సరే, అతను తన కులానికి మాత్రం ఏమీ చేయలేడు. బ్రాహ్మణులు చేయనివ్వరు. అతను చేయగలగాలంటే వీళ్ళ నుంచి కొంత సానుకూలత కావాలి. అది లేదు, ఉండదు. సొంతంగా బ్రతకదల్చుకునేవాడికి చేపలు పట్టడం నేర్పొచ్చు. అల కాదు నాకు రోజూ చేపలు ఉచితంగా సరఫరా చేయమని డిమాండ్ చేసేవాణ్ణి మనం బాగుచెయ్యలేం. బ్రాహ్మణులు ఈ డిమాండ్ చేసే కేటగరీ మనుషులు.
అందుకే అనేకమంది బ్రాహ్మణులు స్వయంగా ప్రభుత్వాధినేతలై కూడా తమ కులానికి ఏమీ చేసుకోకుండానే దిగిపోవాల్సి వచ్చింది. స్వస్తి.
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment