Monday, 12 January 2015

ఇస్తే అతడి పుచ్చెలేచిపోతుంది


అత్యంత పవిత్రమైన అంశాల గురించి ఎలా చూపినా.. వీరు అభ్యంతరం చెప్పరు. మన సినిమాల్లో ఇంద్రుడి దగ్గర నుంచి యుముడి వరకూ అందరూ కామెడీ పీస్ లే! వారి వారి గుణగణాలనే మైనస్ లుగా చూపించి.. నవ్వించేస్తూ ఉంటారు మన దర్శకులు, నిర్మాతలు, హీరోలు. ఇలాంటి వాటిని చూసి వెర్రి నవ్వు నవ్వకోవడంలో హిందువులు ముందుంటారు! హిందువులు ఆవు పాలతో లింగానికి అభిషేకం చేస్తారు.. దీని వల్ల ఉపయోగం ఏముంది.. అవే ఆవుపాలను ఆకలితో ఉన్న వారికి ఇవ్వండి ఉపయోగం ఉంటుంది.. అని సినిమాలో హీరో హిందువులకు సందేశం ఇస్తాడు. మరి అదే హీరో.. పాలను ఇచ్చే ఆవును చంపి తింటే ఒక రోజు ఆకలి మాత్రమే తీరుతుంది.... ఆవును తినడం మానండి, కొన్ని సంవత్సరాల పాటు అది ఇచ్చే పాలను ఆహారంగా తీసుకోండి.. అని చెప్పలేడు! హిందువులకు ఇచ్చే సందేశం ఇస్తే..వాడు తిరుగులేని హీరో.. ఆలోచన పరుడు. మిస్టర్ ఫర్ఫెక్షనిస్టు! అదే హీరో ఇదే దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న మరో మతానికి ఎటువంటి సందేశం ఇవ్వడు. ఇస్తే అతడి పుచ్చెలేచిపోతుంది! ఆ మత పెద్దలు అతడి తలకు వెల కడతారు! ఇందులో సందేహం లేదు. అదేం అంటే... మంచి ఎవడు చెప్పినా తీసుకోవాలి.. మిస్టర్ ఫర్ఫెక్షనిస్టులను విమర్శించడం మీ లేకితనం అంటారు. ఇలాంటి వారందరికీ మెదడు ఒక వైపు మాత్రమే పనిచేస్తుంటుంది రెండోవైపు పనిచేయదు! -
Kumar Ranadhir

No comments:

Post a Comment