Showing posts with label poetry. Show all posts
Showing posts with label poetry. Show all posts

Tuesday, 3 February 2015

ఇక్కడ నా..జాగాని ఎవ్వరూ తీసుకోరు.


నేను బ్రతికినంతకాలం..నాకు ఏ..భూమి ..లేదు .
ప్రతి ఒక్కడూ..నా భూమిమీద పోటే నే .
అందరూ నా భూమిని కబ్జా చెయ్యాలని చూశే వాడే .
కానీ నేను చని పోయాక ....6 అడుగుల నేల మాత్రం ..అచ్చంగా నాదే..
నాదంటే నాదే..
ఇక్కడ నా..జాగాని ఎవ్వరూ తీసుకోరు.
ఇక్కడ ఎలాంటి పోటీ లేదు .
నాకు నా భూమి మీద హక్కు నేను చని పోయాకే వచ్చింది

బ్రతికున్నన్నాళ్ళు నాకు ..కానిది..ఇక్కడే ..ఈ స్మశానం లో నాదయ్యింది


Wednesday, 14 January 2015

నా గది

నా గుండెలో దాక్కున్న
ఫిడేలురాగం  ఎప్పుడన్నా
నీలి నిట్టూర్పు  విడిస్తే
పరుపు తన పొత్తిళ్లలో
దాచుకొని  ఊరడిస్తుంది ....
జలతారు ఆకాశాన్ని
చట్రంలో  బిగించి చూపే
కిటికీ కావ ల రెండు పక్షులు
నా చిన్నతనం నుంచి
ప్రెమగా పొట్లాడు   కుంటూనేవున్నయి... 
వాటికెంతకీ అలుపు రాదు ...... 
వాటికెంతకీ   ప్రేమ తీరదు........
ఆకాశంలోంచి  మొలిచిన
వీనస్ చెయ్యిలా సీలింగ్ కి
ఫాన్ గిర గిరా  తిరుగుతుంటుంది....
గదిలొ శబ్దం ఎప్పుడన్నా  ఘ నీభవిస్తే
స్టీరియో  మైఖేల్ జాక్సొన్ అవుతుంది..............
లతామంగెష్కర్  అవుతుంది ....
నా గదిలొ
కుప్పపొసిన పుస్తకాలమధ్య
నేను అచ్చం 
ప్రాణమున్న  పిచ్చి  మొక్కలా
ఊపిరి పీలుస్తుంటాను  .......
నెను ఇక్కడే
నీలి జలపాతాలు  తయారు చేస్తాను ....
నెను ఇక్కడే
నన్ను నెనె గాలిపటం     చేసుకొని
గాలిలొ కెగరెసుకుంటాను....... 

Tuesday, 13 January 2015

నువ్వు వదిలెసిన చోట

నువ్వు నన్ను వదిలేసి
.నీకు నువ్వే
ఓ..హిరోషిమా అయ్యావు.
కానీనువ్వు వదిలెసిన చోట
నాకు నేనే
ఓ తాజ్ మహల్నై..
నీకొసం ..నిలుచున్నా ....................

Monday, 12 January 2015

కన్నె పిల్ల కలల్లో ఉన్న

ఒరేయె వెధవా..
నీ తెలివి తేటలతో..నీళ్ళనుంచి..నీళ్ళను వేరు చెయ్యగలవేమో.
.పాలనుంచి ....పాలను వేరు చెయ్యగలవేమో.. 
మట్టి నుంచి మట్టిను వేరు చెయ్యగలవేమో.. కాని..నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా.. 
నా నుంచి ..నన్ను ..ఎప్పటికీ వేరు చెయ్యలేవు....
కన్నె పిల్ల కలల్లో ఉన్న ఆభరణన్ని నేనే
వ్రుద్ధ మాత ...స్మశానం లో కోల్పొయిన .....పసుపూ కుంకం..నేనే..
మరణానికి ..ముద్దు ..శిశువుని
జన నానికి దత్త బిడ్డని ...
తూర్పూ పడమరా..రెండు కళ్ళు గా బ్రతికే వాడికి
ఉదయమూ..ఒకటే..అస్తమయమూ ఒకటే..
ఒరేయె వెధవా..
నువ్వు నన్నేమీ చేయలేవు..
నేను మరణం లోకూడా బ్రతికుంటాను..
నువ్వు బ్రతకటం లోకూడా మరణించి ఉంటావు.......

అమ్మ


   
ఒంటరి రాత్రి
కంటి నుంచి జారిపోయే
కన్నీటి  చుక్క..
ఎకాంతం అల్లుతున్న
నైలాన్ సాలెగూడు..
కాలం కురులను
ఆర్ద్రంగా  దువ్వే
చల్ల గాలి..
గది చెక్కిలి పై
చిరునవ్వుల్ని వొంపుతున్న
మొనాలిసా..
అన్నీ అంతర్వలయాల్లొ 
కందకాలు తవ్వుతున్నట్లు 
చేతులు   చాస్తాయి. 
స్తబ్దంగ కదలని కాలంలో 
చికటి నవ్వినట్లు   
నాకేమీ  తోచని  అర్ద రాత్రి 
తెల్లని మంచు ముద్ద కప్పేసినట్లు 
భయం.. భయం.!
ఎడర్ల కావల 
నదుల కావల నా చిన్ని పారదర్శకపు   నోరు తెరిచి
నీ ఊపిరిని 
ఉగ్గులొ  కలిపి తాగించావు  .
దీప  శిఖల్లా.  
అక్షరల్ని దిద్దించి 
ఏకంత సరస్సులో  తేలిన 
ఎర్ర కలువను చేసావు.

పిడికెడు  మూగ గుందెమీద 
పికాసో చెయ్యి గీసినట్లు 
బాల్యం నిండా అన్నీ చిత్రలే!
అలసిపోయిన హ్రుదయం 
పట్టు తప్పి 
ఆకాశంలోంచి  జారి పడ్డట్టు 
దీప స్థంభం   కింద 
పొంచి ఉన్న చీకటి 
ఆవలిస్తూ వెక్కిరిస్తుంది .
స్మృతుల  సర్పాలు క్రూరంగా
కాళ్ళకు  చుట్టుకొని 
ఊపిరి తీసుకోనియకుండా
బుసకొట్టి భయపెడతాయి .
ఎంత బలంగా  మూసినా  
జ్ఞాపకాలు మాత్రం
కిటికీలు తెరుచుకొనొచ్చి 
తేనెటీగల్లా   ముసురుకుంటాయి 
పొలిమెరల్లొ నిలబడి 
సౌందర్యం 
నా కొసం ఆప్యాయంగా 
ఎంత ఎదురుచూసినా 
డియర్  మమ్మీ...
దీపావళికి    ముందు రోజున 
మొదటిసారి నేను 
బాంబు కాల్చినప్పుడు 
నీ కల్లలో మెరిసిన ఆనందార్ద్రత 
నిప్పు నలుసులా 
నాకింకా గుర్తుంది .
ఊపిరాడని రాత్రి 
రంగేసుకున్న మృత్యువు  
నన్ను రకరకాలుగా వేధిస్తున్నప్పుడు 
కన్నీళ్ళతో నీవు 
ఆసుపత్రిలో చేసిన యుద్దం 
అకాల  మరణం  పొందని
ఈ అదౄష్టవంతుడికింకా
గుర్తుంది .
ఇంటి  ముందు వేపచెట్టుకింద 
గుండెల్ని వణికించే 
సంక్రాంతి చలిలో 
నువ్వు తలంటుతుంటే పడ్డ 
కుంకుడు రసం మంట  
ఎదార్ల కీవల 
నదుల కీవల 
నాకింకా గుర్తుంది.
భవిష్యత్తును కట్టేసి 
నగరం రాక్షసిగా నన్ను 
అడుగడుక్కి భయపెట్టినా 
నీ,
ఆశీర్వాద బలంతో 
రగుల్కొంటున్న జీవకణంలా నేను.
చీకటి కాగితం మీద 
మెరిసే రేడియం అక్షరంలా 
నీ అమృత హస్తాలతో 
దేశం బుగ్గ మీద 
పెళ్ళిబొట్టు  పెట్టినట్లు 
నీ వారసునిగా నేన్నేను.

నా గది



నా గుండెలో దాక్కున్న
ఫిడేలురాగం  ఎప్పుడన్నా
నీలి నిట్టూర్పు  విడిస్తే
పరుపు తన పొత్తిళ్లలో
దాచుకొని  ఊరడిస్తుంది ....
జలతారు ఆకాశాన్ని
చట్రంలో  బిగించి చూపే
కిటికీ కావ ల రెండు పక్షులు
నా చిన్నతనం నుంచి
ప్రెమగా పొట్లాడు   కుంటూనేవున్నయి... 
వాటికెంతకీ అలుపు రాదు ...... 
వాటికెంతకీ   ప్రేమ తీరదు........
ఆకాశంలోంచి  మొలిచిన
వీనస్ చెయ్యిలా సీలింగ్ కి
ఫాన్ గిర గిరా  తిరుగుతుంటుంది....
గదిలొ శబ్దం ఎప్పుడన్నా  ఘ నీభవిస్తే
స్టీరియో  మైఖేల్ జాక్సొన్ అవుతుంది..............
లతామంగెష్కర్  అవుతుంది ....
నా గదిలొ
కుప్పపొసిన పుస్తకాలమధ్య
నేను అచ్చం 
ప్రాణమున్న  పిచ్చి  మొక్కలా
ఊపిరి పీలుస్తుంటాను  .......
నెను ఇక్కడే
నీలి జలపాతాలు  తయారు చేస్తాను ....
నెను ఇక్కడే
నన్ను నెనె గాలిపటం     చేసుకొని
గాలిలొ కెగరెసుకుంటాను.......